Movies

మెగా కోడలు ఉపాసన గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి కోడలు అనగానే ఉపాసన గుర్తొస్తుంది. దేశంలోనే అత్యున్నత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలైన ఈమె దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన మెగాస్టార్ చిరంజీవికి కోడలుగా వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తగిన భార్య అని చెప్పాలి. అంత్యంత సంపన్నురాలైన రాకుమారిలా ఉండే ఈమె ఉన్నత విద్యావంతురాలు. చెర్రీని ప్రేమించి పెళ్లాడింది. అనిల్ కామినేని,శోభా కామినేని గారాలపట్టీగా ఉండే ఈమె గ్లోబల్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తిచేసింది. అంత్యంత ఖరీదైన డిజైన్ దుస్తులను ఆమె కూరుస్తుంది. 

ఉపాసన ధరించే దుస్తులు లక్షల్లో ఉంటాయట. ఫ్రెండ్ ద్వారా చెర్రీ పరిచయం ఏర్పడడంతో ఒకరికి ఒకరు కావాలని అనుకున్నారు. ఉపాసన పుట్టినరోజున చెర్రీ తనమనసులో మాట చెప్పాడు. మెగాస్టార్ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వెంటనే ఒకే చెప్పేసింది. ఇంకేముంది ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి అదిరిపోయేలా చేసేసారు. మెగా ఫామిలీలో కలసిపోయిన ఉపాసన చెర్రీ వ్యాపారాల్లో భాగస్వామ్యం వహిస్తూ, సహకారం అందిస్తోంది. ఆమె చదువు మెగా కుటుంబ వ్యాపారానికి , విస్తరణకు దోహదపడిందని చెప్పాలి. 

వ్యాపారాలతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహించే ఉపాసన అపోలో చారిటి విభాగానికి సారధ్యం వహిస్తోంది. అపోలో లైఫ్ ఎండీగా పనిచేస్తున్న ఉపాసన బి పాజిటివ్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య నిపుణుల నుంచి ఆదరణ గల ఈ మ్యాగజైన్ లో ఆరోగ్యం,ఫిట్ నెస్,పోషకాహారం వంటి వాటిపై సమగ్ర వివరాలు అందిస్తారు. భర్తపై అమితమైన ప్రేమ చూపిస్తుంది. మహిళల ప్రాణాలు హరించే కాన్సర్ పై ఈమె ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్లు క్రాస్ మెంబర్ అయిన ఈమె పలు జంతువులను హింస బారినుంచి కాపాడింది. ఉపాసన సినిమాల విషయంలో చెర్రీ నిర్ణయంలో అసలు జోక్యం చేసుకోదట. అడిగితె మాత్రం సలహా ఇస్తుందట. చెర్రీ షూటింగ్స్ సమయంలోనే ఆమె వ్యాపార కార్యకలాపాలకు ఆఫీసుకి వెళ్తుంది. ఒకవేళ అతడు ఇంట్లోనే ఉంటె ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోతుందని అందరూ చెప్పేమాట.