Movies

ఈ బ్లాక్‌ బస్టర్‌ దర్శకులు కూడా అత్యంత దురదృష్టవంతులు

“ఒక నటుడు లేదా దర్శకుడు హిట్‌ దక్కించుకుంటే ఆయన చుట్టు నిర్మాతలు చేరుతారు. ఆ నటుడిని తమ సినిమాలో బుక్‌ చేసేందుకు నిర్మాతలు అడ్వాన్స్‌లు పట్టుకుని తిరుగుతారు. ఇక దర్శకులతో అయితే తమ బ్యానర్‌లో సినిమాను చేయించేందుకు నిర్మాతలు బ్లాంక్‌ చెక్‌ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇక బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు దక్కించుకున్న దర్శకులకు నిర్మాతలు ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తూ ఉంటారు. ఎంత అంటే అంత ఇచ్చేందుకు సిద్దం అవుతారు. కాని తెలుగు సినిమాలో ముగ్గురు బ్లాక్‌ బస్టర్‌ దర్శకుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. 

రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న సుకుమార్‌, భరత్‌ అనే నేను చిత్రంతో ఇండస్ట్రీ టాక్‌ చిత్రంను అందించిన కొరటాల శివతో పాటు గీత గోవిందం చిత్రంతో ట్రెండ్‌ సిట్టింగ్‌ చిత్రాన్ని అందించిన దర్శకుడు పరుశురామ్‌. ఈ ముగ్గురు దర్శకులు కెరీర్‌లోనే ది బెస్ట్‌ చిత్రాలను అందించారు. కాని ఈ ముగ్గురు మాత్రం ఆ సినిమాల తర్వాత తదుపరి చిత్రాల విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. సుకుమార్‌ మరియు కొరటాల శివలు హీరోల కోసం ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది కాలంగా వీరిద్దరు కూడా తమకు డేట్లు ఇచ్చిన హీరోల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి సినిమాలు వచ్చేందుకు మరో ఏడాదిన్నర వరకు పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే దర్శకుడు పరుశురామ్‌ పరిస్థితి మరీ దారుణం. గీత గోవిందం వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని తీసుకు వచ్చిన పరుశురామ్‌ ప్రస్తుతం చేస్తున్న మూవీ అంటూ ఏమీ లేదు. మొన్నటి వరకు మహేష్‌బాబు ఛాన్స్‌ ఇస్తాడేమో అని ఎదురు చూశాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కోసం ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా పరుశురామ్‌ పరిస్థితి ఇలాగే ఉంది. వచ్చే ఏడాది అయినా ఈయన సినిమా ప్రారంభం అవుతుందో చూడాలి.”,