MoviesUncategorized

స్టార్ హీరోలతో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా..ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

మస్త్, పరుగు, అదుర్స్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన షీలా ఇటీవల కాలంలో ఎక్కడ కనపడటం లేదు. పరుగు సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జోడి కట్టి హోమ్లీ ఇమేజ్ తో అందరిని తన వైపు తిప్పుకుంది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తో కొంచెం గ్లామర్ డోస్ పెంచి అదుర్స్ చేసిన సరే సరైన అవకాశాలు రాలేదు. అడపా దడపా కొన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. తనకు టాలీవుడ్ అచ్చిరాదని అర్ధం చేసుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తమిళ,మలయాళ రంగాలకు వెళ్ళింది. 

అయితే అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో ఇక సినిమాలు అనవసరం అని అనుకున్నది. ప్రస్తుతం అయితే షీలా అనే ఒక హీరోయిన్ ఉన్న సంగతి కూడా అభిమానులు మర్చిపోయారు. కానీ ఈ ఆమధ్య తిరుపతిలో కన్పించి అందరికి షక్ ఇచ్చింది. ఈ అమ్మడిని చూసిన అభిమానులు షాక్ తిన్నరు. ఈ అమ్మడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ లతో నటించినప్పుడు కొంచెం బొద్దుగా ఉండేది. ఇక్కడ షీలా ను చూసిన వారికీ ఈమెకు ఏమైంది అనే ప్రశ్న ఉత్పన్నం అయింది. దాంతో ఆమెను మీడియా వారు మీరు ఇలా అయ్యారేమిటి అని అడిగితె ఆమె నేను తమిళంలో ఒక సినిమా కమిట్ అయ్యాను ఆ సినిమా కోసమే ఎలా తయారయ్యానని చెప్పింది. కానీ అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏ సినిమాలు లేవని సమాచారం. అయితే ఆమె కోరుకున్న విధంగా అవకాశాలు రావాలని కోరుకుందాం.