పోకిరిలో మహేష్ బాబు IPS బ్యాడ్జి వెనకున్న స్టోరీ తెలుసా?

పోకిరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని అనూహ్య మలుపు తిప్పింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ ఈ సినిమాలో పాపులర్ అయింది. సాఫ్ట్ గా మహేష్ సినిమాలు సాగిపోతున్న తరుణంలో వచ్చిన పోకిరి ఓ మైలురాయిగా నిల్చింది. 

రఫ్ గా, చాలా ఎనర్జిటిక్ గా మహేష్ పోకిరి మూవీలో కనిపిస్తాడు. రౌడీలా కనిపిస్తూ మాఫియా గ్యాంగ్ తో కల్సి తిరుగుతూ ఉండే గెటప్ లో మహేష్ నటన సూపర్బ్ . డబ్బు కోసం ఏ పనైనా చేస్తూ,డైలాగ్ లు కూడా ఇందులో పవర్ ఫుల్ గా చెబుతాడు. అందుకే పూరి సినిమాలో నటించాలని నటులు ఉబలాట పడతారు. అయితే పోకిరి మూవీలో క్లైమాక్స్ ముందు వచ్చే సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. 

అప్పటివరకూ నాజర్ కొడుకుగా అజయ్ ని అనుకుంటారు. అజయ్ ని విలన్ చంపాక అసలు విషయం బయట పడుతుంది. ‘కృష్ణమోహన్ ఐపీఎస్,బాచ్ నెంబర్ 32567అని నాజర్ చెబుతాడు. అయితే బాచ్ నెంబర్ ఏమిటి ,ఏదో పెట్టాలని కనుక అలా పెట్టారా అని అనుకుంటారు. కానీ ఈ నెంబర్ పూరి జగన్నాధ్ ఫోన్ నెంబర్ అట. షూటింగ్ సమయంలోనే ఈ నెంబర్ చేర్చారు. సినిమాలో ఎక్కడా చివరిదాకా పోలీసాఫీసర్ అని తెలియకపోవడం సినిమాకు పెద్ద ఎసెట్. అయితే బాచ్ నెంబర్ చెప్పడంలో పూరి ఫోన్ నెంబర్ పెట్టారని ఈమధ్యే వెలుగుచూసింది.