Movies

సొంతానికి పిల్లల్ని కనకుండా త్యాగం చేసిన సెలబ్రిటీలు

పెళ్ళై,పిల్లలున్న వాళ్ళను పెళ్లి చేసుకుని,భార్య కొడుకులను తమ కుమారులుగా భావించి తమకంటూ సొంత సంతానాన్ని కనకుండా ఉన్నవాళ్లు కొందరున్నారు. అందులో ప్రధానంగా చూస్తే,దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ని చెప్పుకోవాలి. ఇతడి జీవితం తెరచిన పుస్తకం. పెళ్ళై విడాకులు తీసుకున్న రమను ప్రేమించి రాజమౌళి పెళ్లిచేసుకున్నాడు. రమ కొడుకు కార్తికేయను కన్నబిడ్డలా చూసుకుని,పెంచి పెద్ద చేసాడు. 

అలాగే మరో పాపను రాజమౌళి దత్తత తీసుకుని ప్రేమకు నిర్వచనం చెప్పాడు. అతడి జీవితాన్నే సినిమాగా తీయగల ట్విస్ట్ లు రాజమౌళి జీవితంలో ఉన్నాయి. ఇక సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పరిచయం అయిన సరస్వతి అనే అమ్మాయిని నటుడు బ్రహ్మాజీ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఇంటీరియర్ డెకరేటర్ అయిన సరస్వతికి అప్పటికే పెళ్ళై,సంజీవ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సరస్వతికి జీవితం ఇచ్చి,తనకు ఇక పిల్లలు వద్దనుకున్నాడు. 

పిల్లలుంటే సంజీవ్ ని నిర్లక్ష్యం చేస్తానన్నభయంతో ఎవరూ చేయాలనీ త్యాగం చేసిన బ్రహ్మాజీ లాంటి వ్యక్తుల్ని , సంఘటనల్ని అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం. ఇక పిల్లలుండి పెళ్లిచేసుకున్నాక తమ జీవితంలోకి పిల్లల్ని ఆహ్వానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చిరంజీవి కూతురు శ్రీజకు పెళ్లయి ఓ పాప పుట్టాక విడాకులు ఇచ్చింది. శ్రీజను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ మరో పాపకు జన్మనిచ్చాడు. అయితే శ్రీజ కు అంతకు ముందు పుట్టిన పాపను కూడా కళ్యాణ్ దేవ్ బాగానే చూసుకుంటున్నాడు. ఆలాగే అప్పటి స్టార్ హీరోయిన్ రాధిక సైతం అప్పటికే రెండు పెళ్లి లు చేసుకుని ఒక పాపఉన్నప్పటికీ శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టాడు. అయితే అప్పటికే రాధికకు ఉన్న రియానా అనే పాపను శరత్ కుమార్ ఎంతోప్రేమగా పెంచి పెళ్ళిచేసాడు.