పార్లమెంట్ లో రూమ్ నెంబర్ 5 కహాని ఏమిటో తెలుసా?
బండ్లు ఓడలు,ఓడలు బండ్లు అవుతాయన్న సామెతకు అనుగుణంగా ఎపి రాజకీయాలు కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టిడిపి అతి తక్కువ సీట్లతో ప్రతిపక్షంలో ఉండగా, గతంలో విపక్షంలో గల వైసిపి ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని కూచివేయించిన సీఎం జగన్ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఉన్న ఇల్లు కూడా అక్రమ కట్టడమే కనుక ఖాళీ చేయాలనీ ఒత్తిడి రప్పిస్తున్నారు. ఇక పార్లమెంట్ లో ఐదవ నెంబర్ రూమ్ ని కూడా టిడిపి చేత ఖాళీ చేయించేలా వైసిపి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రూమ్ లో టిడిపి పార్లమెంటరీ కార్యాలయం ఉంది.
అయితే తక్కువ మంది సభ్యులున్న టిడిపికి ఆ గదినుంచి ఖాళీచేయించి ఎక్కువ మంది సభ్యులున్న వైసిపికి కేటాయించాలని స్పీకర్ కి విన్నవించగా, స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. బడ్జెట్ సమావేశాలు అయ్యాక మూడవ అంతస్తులోని గదిలోకి టిడిపి ఆఫీసు మార్చుకోవాలని స్పీకర్ సూచించారు.నిజానికి ఈ రూమ్ 35ఏళ్లుగా టిడిపి ఆధీనంలోనే ఉంది. 1984లో టిడిపి 30సీట్లతో ప్రతిపక్షంగా అవతరించడంతో గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబర్ గదిని కేటాయించారు. 1989లో ఎంపీ సీట్లు రెండుకి పడిపోయినా సరే,ఆ రూమ్ ని కేటాయిస్తూ వచ్చారు.
ఇలా ప్రతిసారి ఆ గదిని టిడిపికి ఇస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ సంఖ్య 3కి పడిపోవడంతో టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి,గరికపాటి రామమోహనరావు,సీఎం రమేష్,టీజె వెంకటేష్ లు బిజెపిలోకి జంప్ అయ్యారు. ఇక ఇద్దరే రాజ్యసభ సభ్యులు మిగిలారు. దీంతో ఈ గదిని వదులుకోవాల్సి న పరిస్థితి టిడిపికి వచ్చింది. నిజానికి ఈ గదిని వారం క్రితం పార్లమెంటరీ మంత్రిత్వ శాఖకు కేటాయించగా, విజయసాయి రెడ్డి గట్టిగా ప్రయత్నం చేయడంతో వైసిపికి కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇది హాట్ టాపిక్ అయింది.

