Sports

మన ఇండియన్ క్రికెటర్స్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

ఇండియా వల్ల మాత్రమే ఐసీసీ బోర్డుకు 70 శాతం రెవిన్యూ వస్తుంది అని ఒక అంచనా. మిగతా క్రికెటర్ల జీతంతో పోల్చుకుంటే మన భారత క్రికెటర్లు భారీగా జీతాలు అందుకుంటున్నారు అన్నది వాస్తవం. ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో మన ఇండియన్ ప్లేయర్స్ కి ఎప్పుడూ చోటు ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో టాప్ 7 అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరో చూద్దాం.

1. సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. సచిన్ ఆస్తుల విలువ రూ. 1066 కోట్లు. సచిన్ టెండూల్కర్ కు ముంబై, బెంగళూరులో మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. సచిన్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ. 500 కోట్లకు పైగానే ఉంటుందని టాక్. సచిన్ కేరళ బ్లాస్టర్స్, బ్యాడ్మింటన్ జట్టు, బెంగళూరు బ్లాస్టర్స్, కబడ్డీ జట్టు తమిళ తలైవాస్ జట్టుకు సహయజమానిగా ఉన్నాడు.

2. ధోని 

ధోని ఆస్తుల విలువ రూ. 734 కోట్లు. ధోని వద్ద ఖరీదైన కార్లు మరియు బైకులు చాలా ఉన్నాయి. ధోని వ్యక్తిగత పెట్టుబడులు సుమారు రూ. 522 కోట్లు. ధోని ఐఎస్ఎల్ జట్టు చెన్నైయిన్ ఎఫ్ సి సహ యజమాని.

3. విరాట్ కోహ్లీ 

మన భారత కెప్టెన్ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్లలో ఒకడు. ఐపిఎల్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాడు కూడా. విరాట్ కోహ్లీకి సుమారు 400 కోట్ల ఆస్తి ఉంది. రాబోయే కాలంలో కోహ్లీ ఆస్తి విలువ 140% పెరుగుతుందని అంచనా.

4. వీరేందర్ సెహ్వాగ్ 

భారత క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్సమెన్ల లో ఒకడు. సెహ్వాగ్ కి మొత్తం మీద 250 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి. సెహ్వాగ్ చాలా నగరాల్లో ప్రైవేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. హర్యానాలో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీతో పాటు అంతర్జాతీయ పాఠశాల కూడా ఉంది.

5. యూసుఫ్ పఠాన్ 

ఇండియన్ క్రికెట్ టీం లో యూసుఫ్ ఎక్కువ కాలం లేడు కానీ ఉన్నన్ని రోజుల్లోనే యూసుఫ్ బాగానే సంపాదించాడు. యూసుఫ్ పఠాన్ ఆస్తి విలువ దాదాపు 150 కోట్ల దాకా ఉంటుంది. యూసుఫ్ తన సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్ తో కలిసి బరోడాలో ‘ది క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్’ అనే క్రికెట్ అకాడమీని నడుపుతున్నాడు. ఇది భారతదేశంలోని ఉత్తమ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

6. యువరాజ్ సింగ్ 

2011 ప్రపంచ కప్ విజయం కోసం క్యాన్సర్ ని సైతం లెక్క చేయని క్రికెటర్ యువరాజ్. తన ఆస్తుల విలువ సుమారు రూ. 146 కోట్లు. యువరాజ్ “యువీకెన్” అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. దీన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం సుమారు రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

7. రోహిత్ శర్మ 

మన ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్తుల విలువ రూ. 125 కోట్లు అని అంచనా. రోహిత్ ప్రస్తుతం ముంబైలోని వోర్లిలో 30 కోట్ల రూపాయల విలువైన ఎస్టేట్ లో ఉంటున్నాడు