Movies

దీనమైన స్థితి నుండి బిగ్ బాస్ వరకు రోహిణి ప్రయాణం ఎలా సాగిందో… ???

కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ త్రి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొత్తం 15మంది కంటెస్టెంట్స్ లో ఏడవ కంటెస్టెంట్  రోహిణి బుల్లితెర నటిగా అందరికీ సుపరిచితమే. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో హాస్యనటిగా పాపులర్ అయిన రోహిణి ,నిజ జీవితంలో కూడా నవ్వులు పండిస్తుందట. హాస్య నటులను అనుకరించడంలో దిట్ట. నిజానికి పోలీసాఫీసర్ అవ్వాలని చిన్నప్పటినుంచి కోరుకున్న ఈమె అందుకోసం ఎన్నో కలలు కంది. అయితే అనుకోకుండా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జీవితంలో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడు తానేమిటో నిరూపించు కోవాలనుకుంటోంది. 

అక్షింతలు సీరియల్ లో సాయికుమార్ చెల్లిగా బుల్లితెరపై నటించిన రోహిణి వైజాగ్ సమీపంలోని దేవరపల్లిలో గోవిందమ్మ,సింహాద్రి దంపతులకు పుట్టింది. రోహిణి నెలకు 25రూపాయల స్కాలర్ షిప్ తో చదువుకుంది. మంచి క్రీడాకారిణి గా షెటిల్ ,టెన్నీస్ లో రాణించింది. డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ అండ్ మినిస్ట్రీ మెంటేషన్ పూర్తిచేసి,బిటెక్ చేసి,క్యాంపస్  లో సెలక్ట్ అయ్యాక హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్షింతలు సీరియల్ తో టివి రంగంలో అడుగుపెట్టి ,ఆతర్వాత కలవారి కోడలు సీరియల్ లో కామెడీ కానిస్టేబుల్ గా అదరగొట్టింది. 

కొంచెం ఇష్టం,కొంచెం కష్టం సీరియల్ లో రాయలసీమ యాసలో చేసిన విలనిజం కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె డైలాగ్స్,మేనరిజం బాగా ఆకట్టుకున్నాయి. ఈమె ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తూ కామెడీని పండిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండడం ఆమె నైజం. ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఆమె జీవితం రెండు వరుస ప్రమాదాల్లో చిక్కుకుని,రివర్స్ అయింది. 2016లో ప్రమాదానికి గురై మరణం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆతర్వాత పుష్కరాల్లో కారులో వెళ్తుండగా లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కాలు విరిగి మంచాన పడడంతో నటనకు కొన్ని నెలలు దూరమైంది. ఇక క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన ఈమె ఎన్నో ఆఫర్స్ ని సీరియల్స్ లో , సినిమాల్లో వదులుకుంది. ఇక మంచాన పడినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎవరూ ఆడుకున్నవారు లేరని ఓ ఇంటర్యూలో కన్నీటి పర్యంతమైంది.