Movies

తేజ చేసిన పనికి నితిన్ ఫ్యామిలీ ఎంత నష్టపోయిందో తెలుసా?

కొత్తవాళ్లను పెట్టి హిట్ కొట్టడంలో ఆరితేరిన డైరెక్టర్ తేజ ఎన్నో హిట్ మూవీస్ తీసాడు. జయం సినిమాతో నితిన్ ని హీరోగా పరిచయం చేసి హిట్ అందించాడు. పైగా తెలంగాణలో హీరోలు లేరనే అపవాదు సమయంలో నితిన్ ని హీరోగా నిలబెట్టిన ఘనత కూడా తేజాది. కానీ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో తేజాకు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. అయితే ఇలా ఎందుకు గ్యాప్ వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఇక తేజా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ప్లాప్ అయ్యాయి. 

అలాగే నితిన్ కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో జయం సినిమాకు పదేళ్లు నిండాయి. దీంతో నితిన్ ,తేజ కాంబినేషన్ లో ధైర్యం అనే మూవీ వచ్చింది. ఇది కూడా డిజాస్టర్ అయింది. తర్వాత నితిన్ ఫ్యామిలిలో తేజకు మరింత గ్యాప్ పెరిగింది. చాలా సమయాల్లో తన హీరోల గురించి చెప్పిన తేజ అసలు నితిన్ గురించి చెప్పలేదు. మరి అంతగా సుధాకర రెడ్డికి,తేజకి గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఉదయ కిరణ్,కాజల్ అగర్వాల్ వంటి వారి గురించి గొప్పగా మాట్లాడే తేజ వాస్తవానికి నితిన్ ప్రస్తావన తేకపోయినా అప్పుడప్పుడు సెటైర్స్ వేస్తాడు. 

నాకు అలాంటి గొప్పవాళ్ళ గురించి మాట్లాడే ఛాన్స్ లేదంటూ చాటుగా సెటైర్లు వేస్తాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్యూలో ధైర్యం సినిమాలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో గొడవలు జరిగాయని తేజ వెల్లడించాడు. జయం సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ ధైర్యం సినిమా కొనడానికి వస్తే, ఈసినిమా ఆడదు, పెళ్ళాం పిల్లలు వీధిన పడతారు అని చెప్పాడట తేజ. దాంతో ధైర్యం మూవీ కొనకుండా అతడు వెళ్ళిపోయాడట. దీంతో తేజపై నిర్మాతల మండలిలో సుధాకర రెడ్డి పిర్యాదు చేయడంతో, తేజకు ఇచ్చిన రెండు కోట్ల రెమ్యునరేషన్ లో కోటి రిటర్న్ ఇమ్మనడంతో వెనక్కి ఇచ్చేయడం జరిగాయట. ఇక అప్పటినుంచే ఇద్దరి మధ్యా తేడాలొచ్చాయి. అదీ సంగతి.