Movies

నరేష్ మూడో భార్య ఎవరి కూతురో తెలుసా ?నమ్మలేని నిజాలు

తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు నరేష్. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తో పోటీ పడి మరీ హాస్య సినిమాల్లో నటించేవాడు నరేష్. బాలనటుడిగా సినీ పరిశ్రమకు వచ్చిన నరేష్ ఆ తర్వాతి కాలంలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. నరేష్ హీరోగా నటించిన జంబలకిడిపంబ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే.

అప్పట్లో జంధ్యాల,నరేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలు దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి. ఆ తర్వాత E.V.V, నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. సీనియర్ నటి,దర్శకురాలు అయిన విజయనిర్మల కొడుకు. విజయనిర్మల కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన తన స్వయంకృషితోనే సొంత ఇమేజ్ ని క్రేయేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. అయితే నరేష్ వైవాహిక జీవితంలో అనేక అటు పోట్లను చూసాడు.

నరేష్ మూడు పెళ్ళిళ్ళను చేసుకున్నాడు. మొదటి భార్య కెమెరామన్ శ్రీను కుమార్తె. వీరికి నవీన్ విజయ కృష్ణ పుట్టాక నరేష్ భార్యతో విభేదాలు రావటంతో విడిపోయారు. నవీన్ విజయ్ కృష్ణ కూడా నందిని నర్సింగ్ హోమ్ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

నరేష్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక ప్రఖ్యాత రచయత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను వివాహం చేసుకున్నాడు. రేఖ సుప్రియ కూడా రచయతే. వీరికి ఒక అబ్బాయి పుట్టాక కలతలు ప్రారంభం అయ్యాయి. దాంతో రెండో పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

ప్రస్తుతం నరేష్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రమ్య రఘుపతి.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ రాజకీయ నాయకుడు రఘువీరా రెడ్డి సోదరుని కుమార్తె రమ్య రఘుపతి. ఇండియాలో చదువు పూర్తి అయ్యాక ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది.

సినిమాలపై ఆసక్తితో దర్శకుడు నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకి అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పడు నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రమ్య విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ప్రేమ మొదలైంది. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి నరేష్,రమ్య వివాహం చేసుకున్నారు.

మూడో పెళ్లి సమయానికి నరేష్ 50 సంవత్సరాలు కాగా,రమ్యకు నరేష్ వయస్సులో సగం ఉంటుంది. వీరికి రణవీర్ అనే కొడుకు ఉన్నాడు. నరేష్ స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురంలో ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన రమ్య దానికి సంబందించిన కార్యకలాపాలను స్వయంగా చుసుకుంటుంది .