Movies

ట్విట్టర్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పగానే ఫ్యాన్స్ లో ఒక వైబ్రేషన్, ఎక్కడలేని ఉత్సాహం ఉరకలు వేస్తది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, రాజకీయ నాయకులూ పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభ కాంక్షలు తెలిపారు. ఐతే అందులో ఏముంది అని అంటారేమో. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పవన్ అంతకు ముందు లాగా సినిమాల్లో నటించడం లేదు, రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రజల తరపున పోరాడే ఒక నాయకుడు గా వున్నారు. అలాంటిది ఇప్పటికి తన అభిమానులు పవన్ ని ఎంతగా ఇష్ట పడుతున్నారంటే ట్విట్టర్ లో వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ట్రేండింగ్ గా హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అంటూ హాష్ టాగ్ తో ట్రేండింగ్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఒక వ్యసనం లా భావిస్తారు. ఒక్కసారి అలా టచ్ చేస్తే ఇంకా వదిలిపెట్టరు. ప్రస్తుతం 9 మిలియన్స్ ట్వీట్లతో ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంకా సమయం ఉండటం తో ఫ్యాన్స్ దానిని 12 మిలియన్స్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పవన్ సినిమాల్లో నటించకపోయిన ఇంత ఆదరణ ఉందంటే మాములు విషయం కాదు. పవన్ అభిమానులు మరి ఈ ట్రెండింగ్ ని ఎంత భారీగా క్రియేట్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."