టీవీ సీరియల్స్ లో నటిస్తూ పెళ్లి చేసుకున్న ప్రేమ జంటలు
సినిమాలకు ధీటుగా బుల్లితెర మీద నటీనటులు సత్తా చాటడమే కాదు,ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నారు. సినిమాల్లో మాదిరిగా నటీనటులు ప్రేమించి పెళ్ళాడుతున్నారు. ఈవిధంగా బుల్లితెర నటులలో పెళ్లిచేసుకున్నవారెవరో తెల్సుకుందాం. మనసు మమత సీరియల్ లో నటించిన ప్రియతమ్ చరణ్,మానస ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు.
అలాగే చంద్రముఖి సీరియల్ లో నటిస్తున్నప్పుడు పరిటాల నిరుపమ్,మంజుల ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. మహేశ్వరీ ,శివనాగ్ జంట కూడా పెళ్లిచేసుకున్నారు. అయితే శివనాగ్ ఆర్టిస్ట్ కాకున్నా ఎన్నో సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. శశిరేఖ పరిణయం,పెళ్ళినాటి ప్రమాణాలు తదితర సీరియల్స్ లో పనిచేస్తున్న సమయంలో ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి మరీ ఆర్య సమాజ్ లో పెళ్లిచేసుకున్నారు.
అపరంజి, అనుబంధాలు,ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్,వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కల్సి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని పెళ్లాడింది. అభిషేకం ,ఇద్దరమ్మాయిలు సీరియల్స్ లో కల్సి నటించిన విష్ణు ప్రియా,సిద్ధార్ధ పెళ్లి బంధంతో నిజ జీవితంలో ఒకటయ్యారు. వైదేహి,సంఘర్షణ,కలవారి కోడలు,మనసు తదితర సీరియల్స్ లో కల్సి నటించిన హరిత,జాకీ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

