Movies

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ జంటలు ..కానీ సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్

కొందరు హీరో హీరోయిన్స్ జంట సినిమాల్లో కల్సి చేస్తే , హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. కానీ ఫలానా హీరోయిన్ తో తమ అభిమాన నటుడు నటిస్తే చూడాలని ఫాన్స్ ఎదురుచూస్తుంటారు. తీరా కల్సి నటిస్తే ఆ మూవీ డిజాస్టర్ అయిపోతుంది. ఈకోవలోకి వచ్చే వాటిని ఒకసారి పరిశీలిద్దాం. చిరంజీవి ,సిమ్రాన్ కల్సి మృగరాజు మూవీ చేసారు. అప్పట్లో యూత్ కి కలలరాణిగా సిమ్రాన్ ఉంది. కానీ ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పవన్ కళ్యాణ్ , త్రిష కల్సి బంగారం మూవీ చేసారు. అప్పట్లో తిరుగులేని హీరోయిన్ గా త్రిష రాణిస్తోంది. అందుకే ఈ ఇద్దరు జోడిగా సినిమా రావాలని ఫాన్స్ కోరుకున్నారు. కానీ బంగారం మూవీ నిరాశ పరిచింది. ఆతర్వాత తీన్ మార్ మూవీ చేసినా ఫలితం దక్కలేదు.

జూనియర్ ఎన్టీఆర్ ,హన్సిక కల్సి మెహర్ రమేష్ డైరెక్షన్ లో కంత్రీ మూవీలో చేసారు. ఆసమయంలో హన్సిక క్రేజ్ అదిరిపోతోంది. దీంతో ఫాన్స్ ఎక్కువగా అంచనాలు వేసుకున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిన ,సినిమా తీవ్ర నిరాశ పరిచింది. పోకిరి మూవీ తర్వాత ఇలియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో ప్రభాస్ సరసన నటిస్తే బాగుండునని ఫాన్స్ ఎదురుచూసారు. మున్నా మూవీ అందుకు వేదిక అయింది. ఫాన్స్ లో అంచనాలు పెంచిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తమిళ నటి మేఘా ఆకాష్, నితిన్ కల్సి నటించిన లై మూవీ తీవ్ర నిరాశ మిగిల్చింది. క్యూట్ లుక్స్ తో మేఘా కట్టిపడేసిన డిజాస్టర్ కావడమే కాదు,వీరిద్దరి కాంబోలో వచ్చిన చల్ మోహన్ రంగా అట్టర్ ప్లాప్ జాబితాలో చేరింది. రష్మిక,విజయ్ దేవరకొండ కల్సి నటించిన గీత గోవిందం హిట్ అయినప్పటికీ ఇదే కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ చతికిలబడింది.

లక్ష్మి మూవీలో వెంకటేష్,నయనతార కల్సి నటించడంతో సూపర్ హిట్ అయింది. అయితే మరోసారి కల్సి నటించాలని ఫాన్స్ కోరుకున్నారు. దాంతో బాబు బంగారం మూవీ చేస్తే అది డిజాస్టర్ గా నిల్చింది. తమన్నా ,అల్లు అర్జున్ కల్సి తొలిసారి చేసిన బద్రీనాధ్ మూవీ ఫాన్స్ లో ఎన్నో అంచనాలు ఏర్పరచింది. కానీ ఈ మూవీ ఘోరంగా దెబ్బతింది. అలాగే అల్లు అర్జున్,కాజల్ అగర్వాల్ కల్సి సుకుమార్ డైరెక్షన్ లో నటించిన ఆర్య 2మూవీ దెబ్బతింది. ఆర్య హిట్ అవ్వడం,బన్నీ,కాజల్ కల్సి నటిస్తున్న ఆర్య 2పై భారీ అంచనాలు ఏర్పడినా చివరకు ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఖలేజా మూవీలో అనుష్క ,మహేష్ కల్సి నటించారు. ఇద్దరి రొమాన్స్ ఫాన్స్ బానే ఎంజాయ్ చేసినా, సినిమా ప్లాప్ అయింది.