Movies

ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ డిజాస్టర్ సినిమాలు ఇవే…కానీ సంచలనం సృష్టించాయి

కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. మరికొన్ని సినిమాలు కొంచెం అటు ఇటూగా టాక్ వచ్చిన మ్యూజికల్ గా హిట్ సాధించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అతడు సినిమాకు మొదట్లో టాక్ తేడాగా వచ్చినా సరే,మణిశర్మ అందించిన బాణీలు జనాన్ని కట్టి పడేశాయి. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఒక్కడు మూవీ కూడా మ్యూజికల్ హిట్ గా నిల్చింది. ఇక రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయింది. అయితే హరీష్ జైరాజ్ అందించిన బాణీలు యువతను ఉర్రూతలూగించాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. అయినా హరీష్ జైరాజ్ అందించిన ఈ మూవీలో పాటలకు యూత్ ఫిదా అయ్యారు.

ప్రభాస్ హిట్ మూవీ వర్షం లో త్రిష అందం,సంగీతం అదరగొట్టాయి. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పవన్ కళ్యాణ్ హిట్ మూవీ ఖుషీలో పాటలకు యూత్ ఫిదా అయ్యారు. జల్సా, గుడుంబా శంకర్ మూవీస్ కూడా మ్యూజిక్ పరంగా అదిరాయి. ఖుషి,గుడుంబా శంకర్ మూవీస్ కి మణిశర్మ,జల్సాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య మూవీ పాటలు ఎప్పటికీ హిట్ గానే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. మంచు మనోజ్ నటించిన మిస్టర్ నోకియా మూవీ విజయాన్ని నమోదు చేసుకుంది. యవన్ శంకర్ అందించిన పాటలు అదుర్స్ .

రామ్ హీరోగా నటించిన జగడం మూవీ డిజాస్టర్ అయింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలరించింది. సురేంద్ర రెడ్డి,తారక్ కాంబోలో వచ్చిన ఊసరవెల్లి డిజాస్టర్ అయింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హిట్ అయ్యాయి. పూరి జగన్నాధ్,రవితేజ కాంబోలో వచ్చిన ఇడియట్ మూవీలోని పాటలు సూపర్బ్. చక్రి సంగీతం అందించాడు. నాని,సమంత జంటగా నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు మూవీ డిజాస్టర్ అయింది . కానీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించిన సంగీతం సూపర్ గా నిల్చింది. నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే మూవీ పాటలు హిట్. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. అలాగే నితిన్ కెరీర్ లో జయం, ఇష్క్ మూవీస్ పాటలు అదుర్స్ . జయం మూవీకి ఆర్పీ పట్నాయక్,ఇష్క్ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.