సావిత్రి గురించి స్టిల్ ఫోటోగ్రాఫర్ చెప్పిన షాకింగ్ న్యూస్
మహానటి సావిత్రిని సినిమాల్లో చేర్చడానికి చౌదరి అనే అయన ఆమెను వెంటబెట్టుకుని మద్రాసులోని స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆర్ ఎం నాగరాజారావు ఇంటికి తీసుకెళ్లి,ఫోటోలు తీయమని,విషయం చెప్పారు. నిర్మాతలకు చూపించడానికి వీలుగా వివిధ భంగిమల్లో ఫోటోలు తీశారు. దాంతో 1950లో వచ్చిన సంసారం మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఎల్ వి ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రంగనాధ్ దాస్ నిర్మాతగా ఉన్నారు. అక్కినేని హీరో. అయితే ముఖ వర్చసు బాగోలేదని ఆ మూవీలోనుంచి తీసెయ్యడంతో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది.
కానీ ఆతర్వాత సావిత్రి తెలుగు,తమిళ చిత్రాల్లో తిరుగులేని హీరోయిన్ అయింది. నటనకే భాష్యం చెప్పింది. దేవదాస్ మూవీ తర్వాత ఆమె కెరీర్ అద్వితీయ మలుపు తిరిగి అక్కడ నుంచి అన్నీ హిట్ కొట్టాయి. అందరితో కలివిడిగా ఉంటూ టెక్నీషియన్స్ కి కూడా ప్రాధ్యాన్యత ఇచ్చేది. ఇక ఆమె నటించిన పలు చిత్రాలకు రాజారావు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు. మెడలో కెమెరా వేసుకుని కెమెరామెన్ ని అనుకరిస్తూ సరదాగా నటించేదట. సర్కస్ రాముడు సినిమా కోసం స్టిల్స్ తీయాలని సావిత్రి సదరు ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చారట.
అయితే 30సంవత్సరాల క్రితం వచ్చిన సావిత్రి,మళ్ళీ ఇప్పుడు వచ్చిన సావిత్రి సన్నగా ఉన్నా, చాలా తేడా ను రాజారావు గమనించారట. ఆ స్టిల్ తీసేముందు ఆమె స్థితిని చూసి చాలా బాధ కలిగిందట. అదే ఆఖరి ఫోటో ఆయన తీయడం. అయితే సావిత్రికి బిడ్డ పుట్టినపుడు కుటుంబ సమేతంగా రావాలని సావిత్రి కోరడంతో రాజారావు ఉత్తిచేతులతో వెళ్తే బాగోదని ఓ సవర బంగారం పట్టుకెళ్లి ఆ బిడ్డ చేతిలో పెట్టారట. అయితే దానికే సావిత్రి పొంగిపోతూ అందరికీ ఆనందంగా చెప్పారట. అప్పటి సంతోషానికి, ఇప్పటి దీనావస్థకు సరిపోల్చుకుని రాజారావు చాలా బాధపడ్డారు. ఈ విషయాలను స్వయంగా ఆయనే రాసారు.

