Movies

హీరోల కెరీర్ లో మానని గాయాలు… పీడకలల వేధిస్తున్న సినిమాలు

బ్లాక్ బస్టర్ మూవీస్ తో స్టార్ హీరో రేంజ్ కి చేరితే, డిజాస్టర్ లు తీరని వేదన మిగులుస్తాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించినప్పటికీ అత్యధిక నష్టాన్ని మిగిల్చిన సినిమాగా అంజి మిగిలింది. చాన్నాళ్లు విడుదలకు నోచుకోని ఈ మూవీ ఎందుకు చేశాడా అని ఫాన్స్ సైతం బాధపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై 90కోట్లకు గాను 57కోట్ల షేర్స్ మాత్రమే వసూలు చేసింది. పవన్ కెరీర్ లో దారుణంగా డిజాస్టర్ అయింది. అలాగే అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీ నిర్మాత ఆదాయాన్ని దారుణంగా దెబ్బతీసింది. కింగ్ నాగార్జున నటించిన భాయ్,గ్రీకు వీరుడు మూవీస్ దారుణ పరాజయం తెచ్చిపెట్టాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో స్పైడర్,బ్రహ్మోత్సవం మూవీస్ దారుణ పరాజయం పొందాయి. స్పైడర్ 120కోట్ల థియేటికల్ బిజినెస్ చేసి,కేవలం 49కోట్ల షేర్స్ మాత్రమే వసూలు చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు, శక్తి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. నిర్మాతలను దారుణంగా దెబ్బతీశాయి. అలాగే మగధీర మూవీతో ఊపందుకున్న రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ దారుణ పరాజయం మిగిల్చింది. నిర్మాత నాగబాబుకు 60శాతం పైనే నష్టాలను తెచ్చిపెట్టింది. రవితేజా కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా షాక్ మూవీ నిల్చింది. ఏ మంత్రం వేసావే మూవీ తో విజయ దేవరకొండ కూడా దారుణ డిజాస్టర్ జాబితాలో చేరాడు. నాగచైతన్య చేసిన యుద్ధం శరణం గచ్ఛామి మూవీ కూడా దారుణ పరాజయం పొందింది.

వెంకటేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా వెంకీ నటించిన షాడో నిలిచిపోయింది. దాదాపు 70శాతం నష్టాలను మిగిల్చిన ఈ మూవీ వెంకీకి ఓ పీడకల అని చెప్పాలి. గోపీచంద్ నటించిన రారాజు,ఒంటరి సినిమాలే కాదు,ఇటీవల వచ్చిన పలు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎంతో ఇష్టపడి చేసిన చక్రం మూవీ ప్రభాస్ కెరీర్ లో అత్యధిక నష్టాల్ని తెచ్చింది. కృష్ణవంశీ తీసిన ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ప్రభాస్ కి రిజల్ట్ గురించి తెల్సిపోవడం విశేషం. సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా నిర్మాతల తిక్క కుదిర్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ సముద్ర ఖని తెరకెక్కించిన జెండాపై కపిరాజు మూవీ భారీ అంచనాలతో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయింది. పెట్టిన ఖర్చులో సగం కూడా రాకుండా డిజాస్టర్ అయింది.