Movies

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆస్తి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

తెలుగు,తమిళ చిత్ర రంగంలో 50కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీకళ్యాణం మూవీతో టాలీవుడ్ లో ఎంటర్ అయింది. అందరి అగ్ర హీరోలతో నటించి , సౌత్ ఇండియా మొత్తం మీద నెంబర్ వన్ స్టార్ డమ్ తెచ్చుకుంది.

తెలుగు సినిమా ఫీల్డ్ లో తక్కువ సమయంలో ఇంతగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి ఇక ఎవరూ లేరని చెప్పాలి. ఎందుకంటే కాజల్ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈమె సంపాదన గురించి రకరకాల చర్చలు ఉన్నాయి. ఏడాదికి ఎంత సంపాదన చేస్తుంది, ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటుంది వంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి.

అయితే కాజల్ ఆస్తి 35కోట్లు ఉందట. సినిమాల ద్వారా ఏడాదికి 5నుంచి 7కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకు 2నుంచి 3కోట్ల పారితోషికం అందుకుంటుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రెండు కోట్ల రూపాయల విలువచేసే ఇల్లు,సూపర్ లగ్జరీ కారు ఉన్నాయి.