తండ్రులతో సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కిడ్స్…సంపాదనలో కూడా…!
ఒకప్పుడు టాలెంట్ చూపించాలంటే ఎంతో శ్రమించాలి. కానీ ఇప్పుడు చాలా సులభం అయింది. సోషల్ మీడియా కారణంగా ప్రచారం జోరుగా సాగించుకోవచ్చు. తద్వారా టాలెంట్ బయట పడుతుంది. పైగా ఆదాయ మార్గానికి అనువుగా కూడా సోషల్ మీడియా వేదిక అవుతోంది. అందుకే మన స్టార్ హీరోస్ పిల్లలు డిజిటల్ మీడియా వేదికగా తమ సత్తా చాటుతూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు.
యూట్యూబ్,సోషల్ మీడియాల్లో లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కల్సి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి క్యూట్ గా మాట్లాడుతూ,ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ కూడా యూట్యూబ్ వేదికగా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నాడు. వీరిద్దరూ నెలకు 30వేలుపైనే సంపాదిస్తున్నారట. దీంతో పేరెంట్స్ ని మించిపోతారేమో సంపాదనలో అంటున్నారు.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసులు కూడా డిజిటల్ వేదికపైకి వస్తున్నారట. ఇది నిజంగా అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపుతోంది. అల్లుఅయాన్, అల్లు అర్హ ఇప్పుడు వీరిద్దరూ చేసే సందడిని సోషల్ మీడియాలో అభిమానులతో బన్నీ పంచుకుంటున్నాడు. తండ్రిని,తాతని ఓ ఆట ఆడుకుంటుంటే ఆ ఫన్నీ వీడియోస్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక యూట్యూబ్ లోకి వస్తే,జెట్ స్పీడ్ లో దూసుకెళ్లడం ఖాయం. ఎందుకంటే,బన్నీ అల్లు శిరీష్ లు డిజిటల్ వేదిక సిద్ధం చేస్తున్నారట. వెబ్ సిరీస్ లో బన్నీ పిల్లలు బాలనటులుగా ఎంట్రీ ఇస్తారట. నేచురల్ స్టార్ నాని,ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ వారసులు, అల్లరి నరేష్,మంచు విష్ణు,ఇలా అందరివారసులు కూడా డిజిటల్ వేదికమీదికి రాబోతున్నారట.

