బిగ్ న్యూస్ : బీజేపీ ఆఫీస్ కు ఆలీ..అసలు స్టోరీ ఇది.!
పొలిటికల్ రంగంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు.ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో రోజు ఇంకో పార్టీలో కనబడతాడు. ఇలా రాజకీయ చదరంగం నడుస్తూనే ఉంటుంది.అయితే అలా పార్టీలో చేసే మనుషుల వల్ల కూడా ఈ రాజకీయాలు కాస్త ఆసక్తికరంగా మారుతాయి.అలా ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అలాగే ఆ తర్వాత ఒక పార్టీ నుంచి మరో పార్టీకు వలసలు గట్టిగానే వెళ్లాయి.అలా ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలోకి టాలీవుడ్ కు చెందిన చాలా మంది నటులే చేరిపోయారు.
అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ ఆలీ కూడా ఒకరు. తన ప్రాణ మిత్రుడు పవన్ పార్టీను కూడా పక్కన పెట్టి అతనికి షాకిచ్చే విధంగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.కానీ ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా బీజేపీ ఆఫీస్ కు అందులోనూ ఢిల్లీలో ఆఫీస్ కు వెళ్లడం గమనార్హం.దీనితో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆలీ బీజేపీలో చేరుతారా అన్న స్పెక్యులేషన్స్ కూడా మొదలయ్యిపోయాయి.కానీ ఈ వార్తలకు చెక్ పెడుతూ ఆలీ ఒక వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.హాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు దేశ ప్రధాని మోడీ గారిని కాలవాలని అనుకుంటున్నారని అందుకు మోడీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ పెద్దలను అడిగేందుకు వెళ్లానని చెప్పినట్టు తెలుస్తుంది.

