.అయ్యో భరత్ కి ఇంత పెద్ద అంగవైకల్యం ఉందా…షాక్ లో అభిమానులు
టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన కామెడీతో ఎంతగానో అలరించేటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ మనందరికీ బాగానే గుర్తుంటాడు.అంతేగాక ఇప్పటికే పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ సన్నివేశాల్లో నటిస్తూ బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు భరత్.అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మరియు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తనకు చెన్నైలో చదువుకునేటప్పుడు లావు సన్నబడటానికి వర్కౌట్ చేస్తున్న సమయంలో తన కంటికి దెబ్బ తగిలిందని ఈ దెబ్బ కారణంగా తన కుడి కన్ను సరిగా కనిపించదని చెప్పుకొచ్చాడు.అంతేకాక క దీనికోసం చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, ఇప్పటికీ తనకు ఈ సమస్య ఉందని తెలిపాడు.అయితే ఈ సమస్య కారణంగా తాను కెమెరా లైట్ నుంచి వచ్చే వెలుతురుని సరిగ్గా చూడలేని అన్నాడు.
అంతేగాక ఈ గాయం కారణంగా పలు సినిమాల్లో నటించే అవకాశాలను కూడా కోల్పోయానని దాంతో కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు భరత్అయితే ఇది ఇలా ఉండగా తాను ఇప్పటికే మెడిసిన్ పూర్తి చేశానని అందులో డాక్టరేట్ కోసం ప్రస్తుతం ఓ ప్రముఖ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నానని అన్నాడు.
అయితే ఒకపక్క సినిమాలు మరో పక్క చదువు అవును ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లే తన జీవితంలో తన తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించారని భరత్ అన్నాడు.అంతేగాక తను ఇంతగా అభిమానించి ఆదరించి నటువంటి తన అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు భరత్.

