Movies

మంజు భార్గవి సినిమాలకు దూరం కావటానికి కారణం… నమ్మలేని వాస్తవాలు

ఒకప్పుడు నాట్యానికి,సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు వచ్చేవి. అందులో శంకరా భరణం అనగానే మనకు కళ్ళముందు మెదిలే పాత్రలు శంకర శాస్త్రి పాత్రధారి జెవి సోమయాజులు తర్వాత కీలక పాత్ర మంజు భార్గవి. సంగీత ,నాట్య ప్రధాన ఇతివృత్తంగా తీసిన సినిమా అది. మంజు భార్గవి డాన్స్ చూడ్డానికే సినిమాలకు వచ్చేవారట. సినిమా నటిగా చేయాలని పేరెంట్స్ ఆమెకు డాన్స్ నేర్పించారు. మద్రాస్ వచ్చి వెంపటి చిన సత్యం దగ్గర నేర్చుకున్నారు. ఆమెకు నటన పట్ల ఆసక్తి ఉండేది. దీంతో హాట్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టింది. మోడర్న్ మహిళ క్యారెక్టర్ గ్లామర్ డ్రెస్ ఫిజిక్ తో చూపించింది. డాన్స్ వాంప్ క్యారెక్టర్ గానే ముద్ర పడింది.

గాలిపటాలు,యమగోలలో ఆడవే అందాల సురభామిని పాటలో గుర్తింపు వచ్చింది. అయితే మంజుభార్గవి ని శంకరాభరణానికి కె విశ్వనాధ్ ఎంపిక చేయడం తో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెలో ఏమి చూసారో ఏమోగానీ,శంకరాభరణం సినిమాకు ఎంపిక చేసి సాహసం చేసారు. మొత్తానికి ఆరాధనాభావంతో చూడ్డమే తప్ప అంతకన్నా అభినయం ఆ సినిమాలో ఉండదు. అందమైన ఫెరఫార్మెన్స్ ఆమెను ఎక్కడికో తీసుకుపోయింది. అంతగా కళ లేకున్నా సరే సావిత్రి,వాణిశ్రీ,బి సరోజా ,జి వరలక్ష్మి,అంజలీదేవి ఇలా అందరూ చామనఛాయలో ఉండేవారు. మంజుభార్గవి కూడా చమనఛాయలోనే బొద్దుగా ఉండేది.

మంచి కళ్ళు, పలువరుస,అభినయం,నాట్యం ఇవన్నీ పుష్కలంగా గల స్త్రీతత్వం ,పొడవుగా ఉండడడం ఆమెలోని ప్లస్ పాయింట్. సెక్స్ గా నటించే ఆమెను పవిత్రంగా ఎలా చూసారో విశ్వనాధ్ కే తెలియాలి. ఈవిడ మంజుభార్గవి కొత్త రూపు తెచ్చుకుని ,ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పిల్లలకు సంగీతం,నాట్యం నేర్పాలని ఫ్యామ్లీ లేడీస్ లో శంకరాభరణం మంచి మార్పు తెచ్చింది. మంజు భార్గవి గొప్పింటి సంబంధం కూడా చేసుకుని,బెంగుళూరులో డాన్స్ స్కూల్ నడిపింది. ఆమెకు పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒక కుమారుడు కాన్సర్ తో చనిపోయాడు. ఇక ఆ మధ్య నిన్నే పెళ్లాడతా సినిమాలో ఆతర్వాత యమలీలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.