పవన్ – క్రిష్ సినిమా సెట్స్ కి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా?
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడమే తరువాయి…. పింక్ రీమేక్ ను చకచకా చేస్తున్నాడు. మరోవైపు క్రిష్ తో కలసి మరో కొత్త సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఈరోజు నుంచి క్రిష్-పవన్ కొత్త సినిమా సైలెంట్ గా పూజ కార్యక్రమాలతో మొదలైంది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఫిబ్రవరి 4 నుంచి మొదలవుతుంది.
అయితే క్రిష్ తో పవన్ చేసే సినిమా భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతోందని, మొగలాయిల పరిపాలనా కాలం నాటి కథ కావడంతో…. ఆ కాలానికి సంబందించిన వాతావరణం సృష్టించడానికి చలాకి ఖర్చు చేస్తున్నారట. అందులో ముఖ్యంగా తాజ్ మహల్, చార్మినార్ సెట్స్ ఈ సినిమాలో కీలకం కానున్నాయని, ఇక సెట్స్ కోసమే భారీ బడ్జెట్ అంటే అదనంగా 20 కోట్లు పెట్టబోతున్నారట.
20 కోట్లతో అద్భుతంగా కొన్ని సెట్స్ ని ఆర్ట్ నిపుణులు తీర్చిదిద్దుతున్నారట. మహమ్మదీయుల కట్టడాలన్నీ సెట్స్ రూపంలో దాదాపుగా తెరపై చూపించబోతున్నారని అంటున్నారు. ఇక పవన్ – క్రిష్ ఫస్ట్ షెడ్యూల్ మాత్రం ఆల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ గా వేసిన సెట్ లో జరగబోతోంది అని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ ల తో కలిసి నటించబోతున్నాడట.
