ప్రేమించిన హీరోయిన్ దక్కక రఘువరన్ ఎలా పిచ్చోడు అయ్యాడో తెలుసా?
విలక్షణ విలన్ గా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న రఘువరన్ కి వైవిధ్యమైన ఉచ్చారణ ఉండేది. పాత్రలకు అనుగుణంగా స్వరాన్ని మారుస్తూ,తనకంటూ మేనరిజం కూడా తెచ్చుకున్నాడు. తమిళ ,తెలుగు,మళయాళ,కన్నడ,హిందీ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించాడు. కేరళ లో వేలాయుగం ,కస్తూరి దంపతుల నలుగురు పిల్లల్లో పెద్ద వాడిగా జన్మించాడు. 1979నుంచి83వరకూ చెన్నైలో యాక్టింగ్ డ్రామా ట్రూప్ అండ్ చెన్నై కింగ్స్ లో సభ్యుడుగా ఉన్నాడు. ఇందులో నాజర్ మెంబర్ గా ఉండేవాడు.
మొదట్లో కన్నడలో చిన్న పాత్రలో మెరిసి,తెలుగులో కూడా చిన్న చిన్న పాత్రలు చేసాడు. ఆతర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటాడు. నటనలో 26ఏళ్ల కెరీర్ సాగించిన రఘువరన్ పెద్ద పెద్ద నటులతో సెహబాష్ అనిపించుకున్నారు. తెలుగులో శివ,ఆహా,పసివాడి ప్రాణం, నాగ,జానీ,సుస్వాగతం,మాస్ ,నాని వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. సుస్వాగతంలో కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో రఘువరన్ నటన హైలెట్. పవన్ కళ్యాణ్,రఘువరన్ మధ్య సన్నివేశాలు ఆడియన్స్ ని కదిలిస్తాయి. ఆహా మూవీలో జగపతి బాబు సోదరుడు పాత్రలో రఘువరన్ నటనకు జనం జేజేలు పలికారు.
1996లో డబ్బింగ్ ఆర్టిస్ట్,నటి రోహిణిని పెళ్లాడిన రఘువరన్ కి 1998లో రుషి అనే కొడుకు పుట్టాడు. అయితే మద్యం,డ్రగ్స్ కి అలవాటు పడడంతో ఎంత చెప్పినా వినలేదు. దీంతో 2004లో రోహిణి,రఘువరన్ లు విడాకులు తీసుకున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడంతో 2008మార్చి 19న మరణించాడు. 24గంటలూ మత్తులో ఉండడానికే ఇష్టపడే రఘువరన్ ప్రేమ విఫలం వల్లే ఇలా ఉండేవాడని అంటారు. నటి అమలను అమితంగా ఇష్టపడితే ఆమె పట్టించుకోలేదని, ఆ బాధలోనే రఘువరన్ డ్రగ్స్ కి బానిస అయ్యాడని అంటారు. తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా మూవీలో రఘువరన్ నటించిన చివరి సినిమా. అయితే మల్లన్న సినిమాలో చేయాల్సి ఉన్న సమయంలో రఘువరన్ మరణించడంతో ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేసారు. ఇక అతడి మరణంతో ఎన్నో సినిమాల విడుదలో జాప్యం జరిగింది.

