మనం తరహాలో మహేష్ కుటుంబ సినిమా?
అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న హీరోలంతా కలసి చేసిన సినిమా మనం. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు కు ఇది ఆఖరి సినిమా కావడంతో నాగార్జున, చైతు, సమంత, అఖిల్ ఇలా అందరు ఆ సినిమాలో నటించారు. ఇక పోతే మంచు ఫ్యామిలీ కూడా ఇలానే ఓ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం ఇలాంటి సినిమాతో రాబోతోందా అంటే అవుననే వినిపిస్తుంది.
సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరు కూడా ఈ సినిమాలో నటించనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు కనిపించనున్నారు. కృష్ణ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్నారట. అంతేకాకుండా నమ్రత, మహేష్ పిల్లలు కూడా నటించనున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో మహేష్ బాబు, కృష్ణ చాలా సినిమాలు తీశారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు, గౌతమ్ నటించారు. అప్పట్లో మహేష్ బాబు, నమ్రత వంశీ సినిమాలో నటించారు. ఇప్పుడు వీరంతా ఒకేసారి వెండితెరపై కనిపిస్తారనే వార్త షికార్లు కొట్టటంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
