Movies

వి టీజర్ రివ్యూ టాక్… నాని ప్రయత్నం ఫలిస్తుందా…?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’ షూటింగ్ మొదలైనప్పటి నుండి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని విలన్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ టీజర్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను కట్టిపడేసింది.

ముఖ్యంగా విలన్ పాత్రలో నాని లుక్, యాక్టింగ్ సూపర్.వరుస హత్యల నేపథ్యంలో సాగే కథలో హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు కనిపించాడు.ఇక విలన్ పాత్రలో నాని అదరగొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తుతున్నాయి.టీజర్‌లో అదిరిపోయే డైలాగ్‌ను నాని చెప్పడంతో ఈ టీజర్‌ను ముగించారు.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ టీజర్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఏదేమైనా ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీలు హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.మార్చి 25న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.