Movies

దివ్య భారతి ఎందుకు మతం మార్చుకుంది.. .ఆమె మరణానికి ప్రత్యక్ష సాక్షి ఎందుకు కన్ను మూసింది

అందం అభినయం పుణికిపుచ్చుకుని 16ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా మారిన దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25 జన్మించింది. అయితే అర్ధాంతరంగా ఈమె ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. అనుమానాస్పదంగా మరణించిన ఈ కేసు చిక్కుముడి ఇప్పటికీ వీడలేదు. ఇటు తెలుగు,అటు తమిళం,అలాగే బాలీవుడ్ లో కూడా నటించి, ఆరోజుల్లో లక్ష రూపాయల పారితోషికం అందుకుంది. బొబ్బిలిరాజా మూవీతో విక్టరీ వెంకటేష్ సరసన నటించి ,టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆతర్వాత తెలుగులో రౌడీ అల్లుడు,ధర్మక్షేత్రం,చిట్టెమ్మ మొగుడు లాంటి మూవీస్ లో చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో చేస్తూ,బాలీవుడ్ లో నటించాలన్న కోరికతో ముంబయి వెళ్ళింది.

విశ్వాత్మ అనే మూవీతో తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకున్న దివ్యభారతి ఆ సినిమా 1992లో విడుదల కావడంతో ఘనవిజయాన్ని అందుకుంది. ఆమె స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. ఒకేసారి 14మూవీస్ కి సైన్ చేసిన దివ్యభారతి కి షోలా ఔర్ షబ్నమ్ మూవీతో గోవిందా ద్వారా దర్శక నిర్మాత సాజిత్ నడియాడ్ వాలా పరిచయం కావడంతో ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. 1992మే10న అతడిని రహస్య వివాహం చేసేసుకుంది. పెళ్ళయాక సనాడ్ నడియావాలాగా పేరు కూడా మార్చేసుకుంది. పెళ్లయ్యాక అంతా సాఫీగా నడుస్తున్న సమయంలో 1993 ఏప్రియల్ 5న అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది.

ఆరోజు షూటింగ్ పూర్తిచేసుకుని తన తమ్ముడు కునాల్ తో కల్సి సాజిద్ తో ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్ళింది. నిజానికి మర్నాడు హైదరాబాద్ కి వెళ్ళాలి. అయితే కాలికి గాయం అయినందున షూటింగ్ కి రాలేనని,క్యాన్సిల్ చేయాలనీ ప్రొడ్యూసర్ కి కాల్ చేసి చెప్పేసి అపార్ట్ మెంట్ కి వచ్చింది. కొద్దిసేపటికి సాజిద్,ఆతర్వాత కునాల్ కూడా వెళ్లిపోవడంతో ఒక్కర్తే ఒంటరిగా ఉంది. అమృత అనే మహిళ ఇంట్లో ఉంది. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ కి ఫోన్ చేయడంతో అతడు వచ్చాడు. కాస్ట్యూమ్ డిజైనర్ తో మాట్లాడింది. హాల్లో అమృత టివి చూస్తోంది. ఈలోగా బాల్కనీకి దివ్యభారతి వెళ్లడం ,పెద్ద శబ్దం రావడంతో అమృత వెళ్లిచూసేసరికి 5వ అంతస్తునుంచి దివ్య కింద పడిపోయి ఉంది. హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయానికి ఆమె తుదిశ్వాస విడిచింది. అయితే నెల్లాళ్లకే అమృత కూడా గుండెపోటుతో కన్నుమూసింది.