Movies

మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీయే పోకిరిగా వచ్చిందా…?

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన పోకిరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెల్సిందే. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అనే డైలాగ్ అప్పట్లో యూత్ లో రివీల్ అయిన డైలాగ్. ఇక పాటలు,స్క్రీన్ ప్లే అన్నీ చక్కగా కుదిరాయి. అండర్ కవర్ పోలీసాఫీసర్ గామహేష్ బాబు ఎక్కడా బయటపడకుండా చాలా సస్పెన్స్ మెయింటేన్ చేసారు. చివరిలో అతడు పోలీసాఫీసర్ అని తెలియడం వరకూ సినిమా ఏంటన్నది మనకు తెలీదు. అంతలా తీశారు. ఇక హీరోయిన్ ఇలియానా కూడా స్పెషల్ ఎట్రాక్షన్.

అయితే తెలుగులో ఏ సినిమా తీసినా దానికి మూల కథ అంటూ ఒకటి ఉంటుందని అంటారు. బాలీవుడు,హాలీవుడ్ లలో వచ్చిన సినిమాల్లో చిన్న స్టోరీ లైన్ తీసుకుని మనకు తగ్గట్టు అల్లేస్తారని చెబుతుంటారు. అయితే దీనికి హాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ కాదు, మన టాలీవుడ్ సినిమానే ఉందని బాగా గమనిస్తే తెలుస్తుంది. టి సుబ్బరామిరెడ్డి నిర్మాతగా చిరంజీవి హీరోగా వచ్చిన స్టేట్ రౌడీ మూవీ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. బప్పీలహరి సంగీతంతో పాటలు అదిరాయి. భానుప్రియ, రాధ హీరోయిన్స్.

ఈ మూవీలో రావు గోపాలరావు, నూతన ప్రసాద్,త్యాగరాజన్ విలన్లు. అయితే కాళీచరణ్ అనే రౌడీ ఊళ్ళల్లో ఉండే మిగిలిన గుండా బాచ్ లను భయపెడుతూ అందరినీ దారికి తెచ్చుకునే కాళీని తమవైపు తిప్పుకోవాలని రావుగోపాలరావు,నూతన ప్రసాద్ లు ట్రై చేస్తారు. తర్వాత అతడు కాళీ అసలు పేరు పృద్వి అని అతోడొక పోలీసాఫీసర్ అని తెలుస్తుంది. శారద భర్త జగ్గయ్య హత్య తర్వాత పృద్విని ఆమె నియమించి ఆఫీసర్ అని తేలుతుంది.ఇక పోకిరి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు తీశారు. కానీ స్టేట్ రౌడీ అప్పటి ట్రెండ్ కి తగ్గట్టు తీశారు. ఇంచుమించు రెండూ పరిశీలిస్తే ఒకేలా ఉంటాయి అదీ అసలు సంగతి.