లాక్ డౌన్ సమయంలో మహేష్ ఏమి చేస్తున్నాడో తెలుసా?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తుండడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో నుంచి అత్యవసరం అయితే తప్ప కాలు బయట పెట్టడం లేదు. ఇక సినీ నటీనటులు అయితే… లాక్ డౌన్ ను ఫుల్ గా వాడుకుంటున్నారు. ఎప్పుడు సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే వీరు ప్రస్తుతం షూటింగులు బంద్ కావడంతో ఎంచక్కా ఫ్యామిలీ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు.
తన భార్య నమ్రత పిల్లలు సితార గౌతమ్ కృష్ణలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకడంతో మహేష్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నమ్రత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మహేష్, పిల్లలు ఏమి చేస్తున్నారో చెప్పింది. మహేష్ పిల్లలు సితార, గౌతమ్ లతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అలాగే అన్ని పరిశ్రమలకు చెందిన కొత్త సినిమాలు, సిరీస్లు చూస్తున్నారు. దాంతో పాటు అయన ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు అని నమ్రత చెప్పుకొచ్చారు.
