Movies

సుమ, రాజీవ్ కనకాల వరస కష్టాలకు కారణం అదేనా…?? బయటపడ్డ ఇంటిగుట్టు..!

అవును, సుమ కనకాల, రాజీవ్ కనకాల దంపతులకు వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర తిరక్కుండానే ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. మొదట రాజీవ్ కనకాల తల్లి ఆతర్వాత తండ్రి దేవదాస్ కనకాల మరణించారు. ఈ రెండు విషాద ఘటనల నుంచి తేరుకోకముందే తాజాగా రాజీవ్ సోదరి,సీరియల్ నటి శ్రీలక్ష్మి రెండేళ్లుగా కేన్సర్ తో పోరాడుతూ హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం కన్నుమూసింది.

ఇలా వరుసగా ముగ్గురు చనిపోవడంతో రాజీవ్,సుమ దంపతుల ఇంట తీరని విషాదం అలుముకుంది. సుమ టాప్ సెలబ్రిటీలు నివసించే ప్రాంతంలో భారీ భవంతి నిర్మించాలని ప్లాన్ చేసి,అది చాలా వరకూ పూర్తిచేసింది. ఈలోగా మామయ్య దేవదాస్ కనకాల చనిపోవడంతో కొత్తింట్లోకి దిగడం వాయిదా పడింది. ఈలోగా మిగిలిన హంగులు కూడా పూర్తిచేశారు. అంతేకాకుండా గృహప్రవేశం కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.

ఈలోగా ఆడపడుచు చనిపోవడంతో విషాదం అలుముకుంది. కొత్తిల్లు అచ్చి రాలేదని అందుచేత ఆ ఇంట్లోకి వెళ్లకూడదని, ఆ ఇల్లు అమ్మేయాలని కొందరు జ్యోతిష పండితులు సూచిస్తున్నారట. అయితే కొందరు జ్యోతిషులు మాత్రం అలా చేయక్కర్లేదని అంటున్నారు. వారి కుటుంబంలో మూడు మరణాలు ఊహించినవేనని,7పదుల వయస్సు దాటడంతో దేవదాస్ దంపతులు మరణించారని,ఇక ఆడపడుచు కేన్సర్ కారణంగా మరణించిందని అందుచేత తప్పుగా అలచించాల్సిందేమీ లేదని అంటున్నారు. త్వరగా కోలుకుని ఆడపడుచు ఫ్యామిలీకి అండగా ఉండాలని బంధువులు చెబుతున్నారు.