చరణ్ హిట్ కన్నా ప్లాపే ఇరగ్గొడుతుందిగా.!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. వారి కారణంగానే చరణ్ అన్ని సినిమాలకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే రామ్ చరణ్ ను మిస్టర్ బాక్సాఫీస్ ఎందుకు అంటారు అంటే అలాంటి డీ మానిటైజేషన్ టైం లో కూడా “ధృవ” చిత్రం 50 కోట్లకు పైగా షేర్ ను కొట్టాడంటే మనం అర్ధం చేసుకోవచ్చు.
అలాగే దాని తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన “వినయ విధేయ రామ” సినిమా అయితే డిజాస్టర్ టాక్ తో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ రెండు సినిమాల వెండితెర పెర్ఫామెన్స్ ఎలా అయితే విరుద్ధంగా ఉందో స్మాల్ స్క్రీన్ పై ఈ రెండిటి పెర్ఫామెన్స్ కూడా అంతే విరుద్ధంగా ఉంటుంది.
గత వారం జెమినీ ఛానెల్లో ధృవ సినిమాను అలాగే స్టార్ మా లో వినయ విధేయ రామ చిత్రాలను టెలికాస్ట్ చెయ్యగా ధృవ కు 5.9 టీఆర్పీ రేటింగ్ రాగ వినయ విధేయ రామ చిత్రానికి 7.53 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంటే చరణ్ హిట్ కంటే ప్లాప్ ఏ రేంజ్ అదరగొడుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇది వరకు టెలికాస్ట్ చేసినప్పుడు వినయ విధేయ రామ వరుసగా రెండు సార్లు 8 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది.

