Movies

ఈ ఫొటోలో ఉన్న సెలబ్రెటీని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

మహమ్మారి కరోనాతో అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్తున్నాయి. భారత్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇక సినీ ఇండస్ట్రీతో పాటు అన్నీ మూతపడ్డంతో కొత్త విషయాలేవీ తెలియడం లేదు. అందుకే పాత విషయాల గురించి నెటిజన్లు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పాత ఫోటోలన్నీ ఒకేచోటికి చేర్చి వాటి కథా కమామీషు తెలియజెప్పే రెట్రో ఫోటోస్ సీజన్ సోషల్ మీడియాలో రన్ అవుతోంది. ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఫోటోలు బయటికి వచ్చాయి.

ఇప్పుడు అందర్నీ టెన్షన్ పెట్టే వర్మ, అప్పట్లో ఎలా ఉన్నాడో చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. పుల్లకు ప్యాంట్ షర్టు వేసినట్లు ఏంట్రా అంత బక్కగా ఉన్నావ్ అంటూ సరదాగా మనల్ని ఆట పట్టించడం తెలుసు కదా. అలాగే వర్మ అప్పట్లో ఉండేవాడు. అమ్మ పక్కనే చిన్న పిల్లాడిలా లాల్చీ పైజామా వేసుకుని ఉన్న వర్మను చూసి భలే ఉన్నాడే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కళ్లజోడు పెట్టుకుని ఏం తెలియని వాడిలా అప్పట్లో అమాయకంగా ఉన్న వర్మ,.. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇండియానే టెన్షన్ పెడుతున్నాడు.ఎప్పుడు ఏం చేస్తాడో.. ఎవర్ని ఏమంటాడో తెలియదు. మొత్తానికి ఈ ఫోటోలు చూపించి నెటిజన్లు భలే కామెంట్స్ తో కుమ్మేస్తున్నారు.