Movies

స్టార్ హీరో కూతురు ఐశ్వర్య రాజేష్ రియల్ లైఫ్ లో ఎన్ని కష్టాలో తెలుసా ?

సినిమా ప్రపంచమే ఓ మాయా ప్రపంచం. సినిమా వాళ్ల జీవితాలు పైకి అందంగా ఉన్నా, లోపల మాత్రం చాలా బాధలు ఉంటాయి. ఒక్క రాయి తగిలితే పగిలిపోయే అద్దాల్లాంటి జీవితాలు కదా. ఇక హీరోయిన్లు అయితే మరీ దారుణం. ఐశ్వర్య రాజేష్ లైఫ్ కూడా అంతే. పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఈయన దాదాపు 54 సినిమాలు చేసాడు. దాంతో పాటు మంచి ఇమేజ్ రావడంతో ఫ్యూచర్ స్టార్ అవుతాడనుకునే తరుణంలో తాగుడుకు బానిసై కేవలం 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. దీంతో అతడి కుటుంబం దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది.

రాజేష్ భార్య తన ముగ్గురు పిల్లలతో చాలా కష్టాలు పడింది. ఇద్దరు కొడుకులు, కూతురు ఐశ్వర్యను పెంచడానికి చాలా తంటాలు పడింది. డబ్బులు బాగా ఉన్నపుడు రాజేష్ చుట్టూ చేరిన కొందరు అన్నీ తీసుకున్నారు. సేవ పేరుతో ఉన్న డబ్బును కూడా పోగొట్టేసాడు. చాలా మందికి ష్యూరిటీ ఇచ్చి ఉన్నదంతా ఊడ్చేసాడు. అదే తరుణంలో తాగుడుకు బానిసై లివర్ పాడైపోవడంతో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసి అతడిని భార్య బతికించుకునే ప్రయత్నం చేసినా, కుదర్లేదు. రాజేష్ చనిపోయిన తర్వాత అప్పులోల్లు వచ్చి ఇంటిమీద పడితే చివరికి టి నగర్‌లో ఉన్న ఒక్క ప్లాట్ కూడా అమ్మేసి వాళ్ల అప్పులన్నీ తీర్చేసింది. తర్వాత ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉండి చాలా కష్టాలు పడింది.ఎలాగోలా పెద్దబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అనుకునే సమయంలో యాక్సిడెంట్‌లో ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి చనిపోయారు.

ఇలా ఐశ్వర్య రాజేష్ ఒకేసారి ఇద్దరు అన్నయ్యలను కోల్పోయి, చివరకు కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది.ఈమె మేనత్త శ్రీలక్షి తెలుగులో 500 సినిమాలకు పైగానే నటించింది. బాబు చిట్టి అనే కామెడీతో ఈమె బాగా పరిచయం. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది. మనాడా మయిలాడ అనే రియాలిటీ షో గెలుచుకున్న తర్వాత ఆమెకు 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్. ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఈమె ఈ స్టార్ ఇమేజ్ వచ్చింది. నల్లగా ఉన్నావ్.. నువ్వెక్కడ హీరోయిన్ అవుతావ్ అని వెకిలి చేస్తుంటే కూడా పట్టు వదలకుండా ప్రయత్నించి ఈ రోజు స్టార్ అయింది ఈమె. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయం అయింది. ఈమె స్టార్ స్టేటస్ వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు కూడా ఉన్నాయి.