చిన్న నిర్మాతల పాలిట వరంగా మారిన ఓటీట…నిర్మాతలు రోజుకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు బంద్ ఉన్నాయి.ఆ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేను, ఎప్పుడు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేను.ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు సిద్దం అయిన చిన్న సినిమాలకు ఓటీటీ ఒక మంచి అవకాశం కలిగిస్తుంది.ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలకు నిర్మాతలు కాసులు పండిస్తున్నారు.అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ చేసుకోవడంతో నిర్మాతలకు అంతో ఇంతో డబ్బులు వస్తున్నాయి.
ఇటీవల విడుదలైన కొత్త సినిమాలను కూడా ఇక్కడ స్ట్రీమింగ్‌కు ఉంచారు.ప్రస్తుతం జనాలు అంతా కూడా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు.ఆ కారణంగా సినిమాలను ఓటీటీ ద్వారా శాటిలైట్ ద్వారా ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అయ్యి ఎంత మంది ఎక్కువగా చూస్తే అంతగా నిర్మాతలకు డబ్బులు వస్తాయి.
చిన్న సినిమాల నిర్మాతలు రోజుకు లక్ష నుండి రెండు లక్షల వరకు కూడా సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమాలకు నిర్మాతలు పబ్లిసిటీ చేసుకుంటూ ప్రస్తుతం హంగామా సృష్టిస్తున్నారు.ఈమద్య కాలంలో అమెజాన్ కూడా టీవీల్లో భారీగా యాడ్స్ ఇస్తుంది.అందువల్ల మంచి వ్యూవర్స్‌ను చిత్ర చిత్రాలు దక్కించుకుంటున్నాయి.దాంతో నిర్మాతలకు కలిసి వస్తున్నది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

