మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తున్న ఈటీవీ..చూస్తున్నారా?
మన తెలుగులో ఉన్న టాప్ ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కూడా ఒకటి.ఎందుకంటే ఈ ఛానెల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ప్రసారం అయ్యే సీరియల్స్ కానీ షోలు కానీ అన్ని చాలా యూనిక్ గా ఉండడమే అని చెప్పాలి. మన తెలుగులో ఇతర ఛానెల్స్ వారు టచ్ చెయ్యని జాన్రా సీరియల్స్ ను ఎన్నో ఏళ్ల క్రితమే ఈటీవీ వారు టచ్ చేసి సూపర్ సక్సెస్ అయ్యారు.
కేవలం ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సీరియల్స్ తోనే కాకుండా టెక్నాలజీ మరియు గ్రహాంతర వాసులు అదే ఏలియన్స్ అనే కాన్సెప్ట్ తో కూడా ఒక అదిరిపోయే సీరియల్ ను ఎప్పుడో తీశారు. అదే “అలౌకిక”. మన తెలుగు బుల్లితెర మీదనే మొట్ట మొదటి సారిగా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఏకైక సీరియల్ ఇది.
ఇప్పుడు కాలం వాళ్లకు తెలీదు కానీ 1980 మరియు 90లలో వాళ్లకి ఈ సీరియల్ గొప్పదనం తెలుసు. అయితే ఈ సీరియల్ ను మళ్ళీ ఈటీవీ వారు మొదటి ఎపిసోడ్ నుంచి ప్రసారం చేస్తున్నారు. కానీ అది టీవీ ఛానెల్లో కాదు యూట్యూబ్ ఛానెల్లో. ఒకవేళ మీరు కానీ ఈ సీరియల్ చూడని వారు అయితే ఒకసారి చూడండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. దీనితో ఈ సీరియల్ తెల్సిన వారికి మాత్రం ఖచ్చితంగా పాత రోజులు గుర్తుకు రాక మానవు.