Movies

హైపర్ ఆదికి ఆ యాంకర్ హ్యాండిచ్చిందా…? ఇందులో నిజం ఎంత?

టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో ప్రతి గురు,శుక్ర వారాల్లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తూ తనదైన శైలిలో పంచులు వేస్తూ అనతికాలంలోనే మంచి ఫేమ్ సంపాదించిన హైపర్ ఆది గురించి తెలియని వారుండరు.అయితే ఇతడు కమెడియన్ గా మొదటిగా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా కమెడియన్, హీరో స్నేహితుడి పాత్రలు, వంటివి చేస్తూ బాగానే తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

అయితే ఇటీవల కాలంలో హైపర్ ఆది గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి ఓ ప్రముఖ యాంకర్ తో హైపర్ ఆది ప్రేమలో పడ్డాడని, అంతేగాక ఈ మధ్య వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిన చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఏమైందో ఏమో గాని ఇటీవలే ఈ యాంకర్ కి మరియు హైపర్ ఆది కి కొన్ని వ్యక్తిగత విభేదాలు, మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ ప్రస్తుతం ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు.ఈ విషయంపై మాత్రం ఇంతవరకు హైపర్ ఆది స్పందించలేదు.

అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది లవ్ ఎఫైర్ పై పలు వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ అందులో ఎంత నిజం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హైపర్ ఆది ఒక పక్క జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్నాడు.దీంతో హైపర్ ఆది ఇటు సినిమాల్లోనూ అటు జబర్దస్త్ లోనూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.