ఆ మెగా ఫ్యామిలీ పోస్టర్లో వాళ్లిద్దరూ కనిపించలేదే… కారణం ఇదే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వినూత్నంగా ప్రచారం చేపడుతున్నారు.ఇందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఓ పోస్టర్ తో కరుణ వైరస్ ని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చారు.అయితే ఇందులో భాగంగా “స్టే హోమ్ ఇంట్లో ఉంటాం యుద్ధం చేస్తాం క్రిమిని కాదు ప్రేమను పంచుతాం కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం స్టే సేఫ్” అంటూ ప్లకార్డులను పట్టుకొని తమదైన శైలిలో అవగాహన కల్పించారు.
అయితే ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల, టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు, నిహారిక వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ పోస్టర్ ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.అంతేగాక ఎక్కడ వాళ్లు అక్కడే ఉంటూ ఈ కరోనా యుద్ధంలో గెలుద్దాం అంటూ పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసినటువంటి ఈ ట్వీట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసినటువంటి పోస్టర్ లో ఇద్దరు మెగా హీరోలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించలేదు.దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.మరోవైపు బన్నీ అభిమానులు కూడా ఇదే రీతిలోనే ప్రశ్నిస్తున్నారు.మరి మెగాస్టార్ చిరంజీవి పవన్ మరియు బన్నిఅభిమానులకి ఏం సమాధానం చెబుతారో చూడాలి.

