పుష్పపై ఫ్యాన్స్ అసంతృప్తి.. ఏ విషయంలో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ముచ్చటగా మూడోసారి ఈ కాంబో రానుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల రష్మిక మందన్న నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అమ్మడి యాక్టింగ్.
కాదు ఓవర్ యాక్టింగ్ పెద్ద తలనొప్పిగా మారిందని, పుష్పలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అని వారు భావిస్తున్నారు.ఇక కన్నడలో రష్మిక పేరు చెబితేనే అక్కడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కన్నడ బ్యూటీ అయినప్పటికీ కన్నడలో సినిమాలు తీయడం లేదని, సొంత భాషలను అవహేలన చేస్తుందని అక్కడి ప్రేక్షకులు కోపంగా ఉన్నారట.
ఇకపోతే ఈ బ్యూటీ పాన్ ఇండియా చిత్రాలకు పెద్ద ఐరన్ లెగ్ అని ఫ్యాన్స్ అంటున్నారు.గతంలో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం ఎలాంటి రిజల్ట్ సాధించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు పుష్ప సినిమాతో మరోసారి ఆ రిజల్ట్ రిపీట్ అవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.
