Movies

“బతుకు బలైపోయిన బండి”కి శ్రీముఖి.!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కానీ అలా ఉంటూ కూడా ఎంటర్టైన్మెంట్ అందించవచ్చని నిరూపిస్తున్నారు. దీనితో ఈ సమయంలో మొత్తం టీవీ లకు మరియు యూట్యూబ్ లకు అతుక్కుపోయారు. ఇదిలా ఉండగా మన తెలుగులో “బతుకు జట్కా బండి” అనే షో తెలీని వారు ఉండరు. దానిపై ఇప్పటికే ఎన్నో స్పూఫ్ లు కూడా ఉన్నాయి.

ఇప్పుడు దాని లానే తెలుగు బుల్లితెర టాప్ యాంకర్ శ్రీముఖి ఒక వినూత్న ప్రయత్నం చేసింది. భార్య భర్తల మధ్య గొడవలు తీరుస్తా అని ఇంకో స్పూఫ్ షో మొదలు పెట్టింది. అదే “బతుకు బలైపోయిన బండి” ఇందులో జబర్దస్త్ అవినాష్ మరియు యాంకర్ విష్ణు ప్రియాలు భార్య భర్తలుగా చెయ్యగా వారి సమస్యలను శ్రీముఖి మధ్యలో పెద్దగా నిలిచి పరిష్కారిస్తుంది.మంచి కామెడీ మరియు చిన్న మెసేజ్ తో కూడుకున్న ఈ వీడియోను ఇటీవలే విడుదల చేయగా దానికి వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతుంది.ఇంకా ఈ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయ్యండి. శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ లో చూడండి.