Movies

పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ బన్నీని డామినేట్ చేస్తుందా?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ సుక్కు,బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర ఏ విధంగా చేయబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ – ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ లుక్ తో చూపిస్తున్నాడు. ‘పుష్ప’ పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుక్కు మరో ప్రయోగమా అనిపిస్తుంది. రాయలసీమ చిత్తూరు యాస – భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా తన సత్తా చాటుతాడని అంటున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ గెటప్ కూడా చూస్తేంటే ‘రంగస్థలం’లో చరణ్ ని పోలివుంది. దీని కోసం బన్నీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవడం చర్చకు దారితీస్తోంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడని టాక్.

పుష్ప కూడా మరో బ్లాక్ బస్టర్ కాబోతోందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఫస్ట్ లుక్ తో బన్నీ క్యారక్టర్ ఏంటనేది ఒక ఐడియా వచ్చింది. అయితే రష్మిక క్యారెక్టర్ చూస్తే, ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. కాగా రష్మిక క్యారెక్టర్ ఒక పెద్ద ట్విస్ట్ తో స్టోరీలో అడుగుపెడుతుందట. స్టోరీ ముందుకు సాగుతుండగా ఆమె పాత్ర బిహేవియర్ ఆడియన్స్ ని షాక్ గురిచేస్తుందట. రష్మిక కెరీర్లో గుర్తుండిపోయే క్యారక్టర్ గా ఇది మిగిలిపోనుందని వినిపిస్తోంది. ఇప్పటి దాకా మోడరన్ గర్ల్ పాత్రలలో నటించిన రష్మికని సుక్కూ ఒక కొత్త కోణంలో చూపిస్తున్నాడని చెబుతున్నారు.