రమ్య కృష్ణ డిమాండ్ మాములుగా లేదుగా…ఎంతలో ఉందోచూడండి…ఎక్కడ తగ్గటం లేదు
బాహుబలి మూవీలో నటించాక ఒకప్పటి అందాల నటి రమ్యకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈమె డిమాండ్ భారీగానే ఉందట. రమ్యకృష్ణ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తండలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ప్రకాష్ రాజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ కొట్టిన ‘అంధాధున్’ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
యంగ్ హీరో నితిన్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటనతో పాటుగా ఆ సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ కూడా సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇంకా చెప్పాలంటే ‘అంధాధున్’లో టబు పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటూ, నెగిటివ్ అండ్ బోల్డ్‌గా ఉంటుంది. ఆ పాత్రలో నిజంగా టబు అదరగొట్టింది. దీంతో అంతటి వెయిట్ ఉన్న పాత్రను తెలుగులో ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారడంతో మొదట ఆ పాత్రను టబుయే చేస్తుందని భావించారు.
కానీ ఆ తరువాత యాంకర్ అనసూయ పేరు కూడా తెరమీదికి వచ్చింది. ఎలాగూ టబు భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కనుక మొదట అనసూయను తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఈ పాత్ర పవర్ ఫుల్ కనుక తాజాగా రమ్యకృష్ణను ఆ పాత్ర కోసం తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకుంటు న్నారట. ఇదే అదునుగా చూసుకొని ఈ చిత్రంలో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తోందని టాక్. ఈ సినిమాలో నితిన్‌తో పాటు రమ్య కృష్ణది ప్రధాన పాత్ర కావడంతో పాటు సినిమాలో కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో రమ్య భారీగానే అడిగినట్లు వినికిడి.
