ఈ కాలం హీరోయిన్స్ కి ఆ కాలం హీరోయిన్స్ కి తేడా అదే…!
సినీలోకంలో కొత్త నీరు వచ్చినా కొద్ది పాత నీరు పోవడం సహజం. కానీ దశాబ్ధం పైగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్, తమన్నా లు ఇప్ప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. 2007లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమంది. టాలీవుడ్ స్టార్ హీరో లందరి సరసన రొమాన్స్ చేసి అలరించారు. తమన్నా ,కాజల్ హీరోయిన్లుగా తెలుగునాట అడుగుపెట్టి దాదాపు 15ఏళ్ళు అవుతున్నా.. ఇంకా ఛాన్స్ లతో దూసుకెళ్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో కాజల్ రెండు భారీ చిత్రాలు చేస్తుంది. చిరంజీవి 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న ఆచార్య మూవీ .. అలాగే, మంచు విష్ణు హీరోగా తెరక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు మూవీ. అంతేకాదు, కమల్ హీరోగా తెరక్కుతున్న భారతీయడు 2 సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ కావడం విశేషం. ఇక తమన్నా తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్, దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలతో పాటు ఓ హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక కాజల్ తమన్నాలతో కెరీర్ స్టార్ట్ అయిన ఎందరో హీరోయిన్లు మినిమం పదేళ్లు ఇండస్ట్రీని వాళ్ల అందాలతో ఏలారు.
మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోయిన్లను చూస్తే, రెండు మూడు సినిమాలకే వాళ్ల కెరీర్ డిసైడ్ అయిపోతుంది. ఈ జనరేషన్ హీరోయిన్స్ కి ఎక్కువకాలం హీరోయిన్స్ గా కొనసాగే ఛాన్స్ లు లేవు. కాజల్ తమన్నా అనుష్క, శ్రీయ లాంటి వాళ్లు ఇప్పటికి టాప్ హీరోయిన్లుగా ఆదరణ పొందుతున్నారంటే.. దానికి కారణం వాళ్ల కున్న కమిట్ మెంట్, హార్డ్ వర్క్. ఇప్పటి హీరోయిన్లు రెండు ప్లాపులు పడితే కనబడకుండా పోతున్నారు. ప్రయత్నాలు చేయడం కూడా మానేస్తున్నారు. అందుకే అప్పటి హీరోయిన్స్ లా ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండగలరా అంటే చెప్పడం కష్టమే మరి.

