Movies

భారీ విరాళం కోసం ధరలు పెంచిన నెట్ ఫ్లిక్స్..!?

ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ఒక్క ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా మన దేశంలో కూడా నెట్ ఫ్లిక్స్ బాగానే ఆదరణ పొందింది. అయితే ఇటీవలే కరోనా ప్రభావం మూలాన అన్ని డిజిటల్ యాప్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ పై ఆధారపడుతున్నారు.

అలాగే సమయంలో గత కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ వారు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ కు 100 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించి తమ వంతు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో 50 మిలియన్ డాలర్లు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది, అందుకు గాను తమ ప్లాన్స్ తాలూకా ధరలను పెంచి ఆ విధంగా 50 మిలియన్ డాలర్లను మళ్ళీ కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది.