సాయి ధరమ్ తేజ్ లైఫ్ లో చేదు సంఘటన…తల్లితండ్రులు విడిపోవడానికి కారణం అదే?
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ..మొదటి చిత్రం ‘పిల్ల నువ్వు లేని జీవితం ‘చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ..సుప్రీమ్ లాంటి వరస హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఓ బ్రాండ్ ను ప్రేక్షక వర్గాన్ని సంపాదించుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవి ,పవన్ కళ్యాణ్ పోలికలు తేజులో కచ్చితంగా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి .అయితే అనుకోకుండా వరస పరాజయాలతో అతని కెరియర్ కొంచెం స్లో అయింది.ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ రాకపోవడంతో ఆ క్రమంలోనే పేరులో ధరమ్ ని తొలగించి సాయి తేజగా తన పేరును మార్చుకున్నాడు ..కాగా ఈ నేమ్ చేంజ్ బాగానే వర్కౌట్ అయింది ..
సంఖ్య శాస్త్రం అతని విషయంలో బాగా పని చేసింది .తర్వాత వరసగా రెండు చిత్రాలు హిట్ అయ్యాయి .చిత్రలహరి ,ప్రతి రోజు పండగే చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు .దీంతో తేజు కెరియర్ మళ్ళీ గాడిలో పడింది .ఇక ఇదే ఊపులో అతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్న విషయమే తెలిసిందే.కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే నిలిచింది ..లాక్ డౌన్ ముగియగానే వేగంగా చిత్రాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మదర్ డివోర్స్ తీసుకున్నారనే విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది .కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు .. తాజాగా సాయి ధరమ్ తేజ్ ను ఇంటర్వ్యూ చేస్తూ రిపోర్టర్ తన పేరెంట్స్ డివోర్స్ గురించి అడిగారు ..దానికి సాయి ధరమ్ చాలా డీసెంట్ గా సమాధానమిచ్చారు .నా జీవితంలో ఆనందంతో పాటు విషాదం కూడా ఉంది అని నన్ను చాలా కలతకు గురి అయ్యేలా చేసిన సంఘటన అది అని చెప్పారు .నేను పదో తరగతి చదువుతున్నపుడు నా పేరెంట్స్ కొన్ని అభిప్రాయం భేదాలతో విడిపోయారని తెలిపారు .ఏది ఏమైనా అదంతా గతం ..గడిచిపోయింది ..కానీ నాకు అమ్మైనా నాన్నైనా నాకు అమ్మే ..నన్ను తమ్ముడిని ఏ లోటు రాకుండా పెంచింది అని సాయి ధరమ్ తెలిపారు .
ఆ తర్వాత కొంత కాలానికి అమ్మ రెండో వివాహం చేసుకుంది ..ఆయన చాలా మంచి వ్యక్తి .కేర్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారని తేజు వెల్లడించారు.మీ తండ్రి దగ్గర నుండి మీ సినిమాకు సంబందించిన సలహాలు ఏమైనా తీసుకుంటారా అని అడగ్గా నేను ఎలాంటి సలహాలు తీసుకోను ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్ కు సంబందించిన వ్యక్తి కాదు అని బదులు ఇచ్చారు ..