Movies

సమంత కెరీర్ లో టాప్ 5 సినిమాలు ఇవే

అందం,అభినయం పుష్కలంగా ఉన్న సమంత గ్లామర్ కే కాదు, లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు సూటవుతుంది. అందుకే టాలీవుడ్‌లోనే కాదు, ద‌క్షిణాదినే అగ్ర తార‌గా కొన‌సాగుతోంది‌. ఇప్పుడు లేడీ ఓరియెంట్ క‌థ‌ల‌కు ఇప్పుడు తానే కేరాఫ్ అడ్ర‌స్స్‌ అయింది. ద‌క్షిణాదిన ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ కూడా ఈమె. ఇప్పుడు కొత్త‌గా వెబ్ సిరీస్‌ల‌లోనూ అడుగుపెట్టింది. త్వ‌ర‌లోనే నిర్మాత‌గానూ మార‌బోతోంద‌ని టాక్‌. స‌మంత కెరీర్‌ని మ‌లుపు తిప్పిన ఏం మాయ చేసావే సినిమా. గౌత‌మ్ మీన‌న్ సినిమాల్లో క‌థానాయిక‌ల పాత్ర‌లు బాగుంటాయి. అయితే జెస్సీ మాత్రం వాటికి త‌ల‌మానికంగా నిలిచింది. జెస్సీగా స‌మంత న‌ట‌న‌, త‌న ముద్దు ముద్దు మాట‌లు, చిలిపి ఎక్స్‌ప్రెష‌న్స్‌. ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేశాయి. స‌మంత కెరీర్‌లోనే ఈ చిత్రానికి తొలి అవార్డు తెచ్చి పెట్టి, ప్ర‌త్యేక స్థానం కల్పించింది. అంతేనా, ఈ మూవీతో ప‌రిచ‌య‌మైన నాగ‌చైత‌న్య‌ని తాను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు స‌మంత స‌రితూగుతుంద‌న్న విష‌యాన్ని బృందావ‌నం నిరూపించింది. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌ని కాజ‌ల్‌తో పంచుకుంది. అయినా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో అగ్ర హీరోల దృష్టి స‌మంత‌పై ప‌డింది. టాప్ హీరోల‌తోనే సినిమాలు చేసింది. రంగ‌స్థ‌లంలో రామ‌ల‌క్ష్మి పాత్ర స‌మంత కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌. డీ గ్లామ‌ర్ రోల్ లోనూ స‌మంత‌ని చూడ‌గ‌లం అని ఈ సినిమా నిరూపించింది. ‘ఎంత చ‌క్క‌గున్నావే’.. , పాట‌లో స‌మంత ఎక్స్‌ప్రెష‌న్స్ ఆల్ టైమ్ సూప‌ర్ హిట్‌. రంగ‌స్థ‌లం త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా స‌రికొత్త‌ అభిమానుల్ని తెచ్చింది.

ఇక పెళ్ల‌య్యాక నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించిన మ‌జిలీ సినిమాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది . త‌న పాత్ర కేవ‌లం ద్వితీయార్థానికి ప‌రిమితం. అయితేనేం.. సినిమా మొత్తాన్ని తన భుజాల‌పై వేసుకుని న‌డిపించింది. ఇది కూడా డీ గ్లామ‌ర్ పాత్రే. ఎమోష‌న్స్ పండించ‌డంలో త‌న‌కు తిరుగులేద‌ని ఈ సినిమా నిరూపించుకుంది. స‌మంత‌లోని ప‌రిపూర్ణ న‌టిని ఓ బేబీ మూవీ ఆవిష్కరించింది. డెబ్భై ఏళ్ల బామ్మ‌లా కొన్ని స‌న్నివేశాల్లో క‌నిపించిన తీరు.. విమ‌ర్శ‌కుల్ని సైతం మెప్పించింది. హాస్యం, ఎమోషన్స్‌.. అన్నీ పండాయి. త‌న కెరీర్‌లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంటూ, నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది.