Movies

పవన్ కొడుకు అకిరా ఫెవరెట్ హీరో ఎవరో తెలుసా? పవన్ కాదట

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు హీరోల్లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండే హీరో పవన్‌ కళ్యాణ్‌గా చెప్పుకోవచ్చు.ఆయన్ను అందరు హీరోల అభిమానులు కూడా అభిమానిస్తూ ఉంటారు.అంతటి అభిమానంను దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మాత్రం అడవి శేష్‌ ను అమితంగా ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉన్నాడు.ఈ విషయంను రేణు దేశాయ్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఈమద్య కాలంలో రేణుదేశాయ్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు.ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.తాజాగా కూడా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పిల్లల గురించి చెప్పుకొచ్చింది మదర్స్‌ డే సందర్బంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.తన పిల్లల గురించి చెప్పిన ముచ్చట్లు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూఅకీరాకు అడ్వంచర్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం.ఎవరు చిత్రం చూసిన తర్వాత అడవి శేషుకు అభిమాని అయ్యాడు.శేషు నటన అంటే అకీరాకు చాలా ఇష్టం.అన్నా అంటూ శేషును అకీరా పిలుస్తుంటాడని రేణు చెప్పుకొచ్చింది.ఇక అకీరాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేదని చెప్పింది.ఇద్దరు పిల్లలకు కూడా సినిమాలపై అంతగా ఆసక్తి లేదని రేణు దేశాయ్ పేర్కొంది.