Movies

జయం మూవీ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ హిస్టరీలో జయం మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. వెరైటీ లవ్ స్టోరీతో నితిన్ ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ తేజ అందంగా తెరకెక్కించాడు. మూడుకోట్లతో ఇల్లు,రెండు కార్లు తేజ కొన్నాడంటే ఈ సినిమా విజయం ఎలాంటిదో చెప్పక్కర్లేదు. ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే, 2001లో నువ్వు నేను మూవీ రిలీజ్ రోజున ఆడియన్స్ తో కల్సి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో తేజ సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్ సమయంలో 18ఏళ్ళ ఓ కుర్రాడు ని చూసిన తేజ ఫ్లాట్ అయ్యాడు. దగ్గ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని ,యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని అవసరమైనపుడు పిలుస్తా అని తేజా చెప్పేసాడు. ఆతర్వాత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు అని తేజకు తెల్సింది. పైగా నువ్వు నేను మూవీకి నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే.

ఇక తేజకు పెద్దవాళ్ళనుంచి ఆఫర్స్ రావడంతో అల్లు అరవింద్ కొడుకు అర్జున్ హీరోగా తేజా ద్వారా లాంచ్ చేయాలని ప్లాన్ చేసారు. అప్పటికే జయం మూవీ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో బన్నీని టెస్ట్ షూట్ చేసారు. అయితే ఈ క్యారెక్టర్ కి బన్నీ సూటవ్వడం లేదని, మరోసినిమా చూద్దామని తేజా చెప్పేసాడు. తర్వాత చాలామందిని ఈ క్యారెక్టర్ కోసం అనుకున్నాక చివరకు నువ్వు నేను మూవీ 150డేస్ రోజున ఫోన్ రావడంతో వెంటనే తేజ ఆఫీసుకి నితిన్ వచ్చేసాడు. ఫోటో షూట్ లో ఒకే అవడం,సుధాకర రెడ్డి కూడా ఒకే చెప్పడంతో ముంబయి నుంచి సదాను హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. విలన్ ని కూడా ముంబయ్ నుంచి తీసుకున్నారు. సాంగ్స్ రికార్డ్ అయ్యాక 2002లో షూటింగ్ ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోలో హీరోయిన్ హౌస్ సెట్ వేశారు. అయితే విలన్ యాక్టింగ్ సరిగ్గా రానందున ,వెంటనే గోపీచంద్ ని పిలిచాడు. హీరో వేషం అనుకుని వస్తే, విలన్ వేషం అని చెప్పడంతో గోపీచంద్ ఒకే చెప్పాడు.

బండి బండి రైలు బండి సాంగ్ షూటింగ్ లో డాన్స్ మాస్టర్ శంకర్ ఒక డాన్సర్ ని కొట్టడం,అది అసోసియేషన్ చీలిక దాకా వెళ్లడం తర్వాత సర్దుమణగడం జరిగాయి. ఇక ఒక సీన్ లో హీరోయిన్ సదా ఏడవడం సీన్ సరిగ్గా రాకపోతే తేజ ఆమె చెంప చెళ్లుమనిపించడమతొ నిజంగానే ఏడ్చేయడంతో సీన్ పండింది. 65రోజుల్లో పూర్తయ్యాక మంచి ఆఫర్స్ వచ్చినా ఒన్ గా తేజ 58ప్రింట్స్ తో 2002 జూన్ 14న రిలీజ్ చేసాడు. లవ్ సీన్స్,కామెడీ,ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే,ఉత్కంఠ రేపే సన్నివేశాలు , ఆర్పీ పట్నాయక్ సంగీతం,పాటలు వెరసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బ్లాక్ బస్టర్ అయింది. 18కోట్ల షేర్,30కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాలుగు వారాల్లో 150ప్రింట్లకు చేరింది. 70సెంటర్స్ లో వందరోజులు ఆడింది. నైజాంలో 7కోట్ల షేర్ తో అదరగొట్టేసింది.