Movies

కరీనా కపూర్ గురించి మనకు తెలీని నమ్మలేని నిజాలు

నడిచే అందమైన రూపం ఆమెది .. జాబిలిని మించిన అందం అని కూడా అంటారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ భామ కరీనా కపూర్. అందం,అభినయం,డాన్స్ ఇలా అన్నింటా ఆమె దూసుకుపోతూ ఆడియన్స్ మతిపోగొడుతోంది. చమక్ చలో అంటూ యువతలో ఉర్రూతలూగించే కరీనా అంటేనే దర్శక నిర్మాతల పాలిట కల్పతరువు. ఈమె ఉంటె చాలు కాసులు వర్షం కురవాల్సిందే. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 10సార్లు ఫిలిం ఫేర్ కి నామినేట్ అయి ఆరుసార్లు గెల్చుకుంది.

ప్రముఖ బాలువుడ్ నటుడు రణధీర్ కపూర్, భవిత లకు 1983సెప్టెంబర్ 21న ముంబాయిలో జన్మించిన కరీనా కపూర్ సినీ రంగం పై బాల్యం నుంచే మక్కువ పెంచుకుంది. దీనికి కారణం ఈమె అక్క కరిష్మా కపూర్ కూడా సినీ హీరోయిన్. ఇక ఈమె తాత ఎవరో కాదు రాజ్ కపూర్. ముంబయి,డెహ్రాడూన్ లలో స్టడీస్ పూర్తిచేసిన ఈమె కు చదువుపై అసలు మక్కువలేదట. మాథ్స్ తప్ప ఇంకేమీ పట్టేది కాదట. కేవలం తల్లికోసమే చదువు సాగించిన కరీనా ముంబై లా కేలేజిలో చేరిన ఈమె ఏడాదయ్యాక ఇష్టమైన నటనావైపు అడుగులు వేసింది.

యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందిన కరీనా 2002లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బాంగ్లాదేశ్ యువతిగా మంచి అభినయం ప్రదర్శించిన కరీనా కు ఆ సినిమా పెద్దగా పేరు తేలేదు. తర్వాత కబీ ఖుషీ కబీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత మూస సినిమాలతో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈమెకు చమేలీ లాంటి సినిమాలు మంచి ఊపునిచ్చాయి. ఓంకారా,బాడీగార్డ్,ఖుర్బానా, వుయ్ ఆర్ ఫామిలీ ,,భజరంగీ బాయ్ జాన్,ఊడ్త పంజాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్లింది. 2012లో సైఫ్ ఆలీఖాన్ ని పెళ్లాడింది. పెళ్ళిచేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చినా సరే, వయస్సు మీద పడుతున్న సరే, సెకండ్ ఇన్నింగ్స్ లో కుర్రకారుకి మత్తెక్కించే ఈ భామ యువ హీరోయిన్స్ కి ధీటుగా తన సత్తా చాటుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."