Movies

రూట్ మార్చిన రకుల్…బాగా వర్క్ అవుట్ అవుతుందట

గతంలో అయితే హీరోయిన్స్ పది పదిహేనేళ్ళు చిత్రసీమను ఏలేసేవారు. ఒక్కో హీరోతో 10నుంచి 30సినిమాల వరకూ జోడీ కట్టేవారు. ఆడియన్స్ లో కూడా అలాంటి జంటలకు క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు నాలుగైదు చిత్రాలతోనే హీరోయిన్స్ అవుట్ అయిపోతోన్నారు. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా రెండు మూడు సంవత్సరాలు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో దాదాపు యంగ్ స్టార్ హీరోల అందరితో కూడా నటించింది. హిందీ.. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఎందుకో సడన్ గా ఫేడ్ అవుట్ అయింది.

అయితే తెలుగులో ఎప్పుడైతే ఆఫర్లు తగ్గాయో అప్పటి నుండి ఈమెకు హిందీ, తమిళంలో కూడా ఛాన్స్ లు లేకుండా పోయాయి. సినిమాల్లో ఛాన్స్ లు లేకున్నా కూడా ఉత్తరాదిన ఈమెకు ఉన్న క్రేజ్ తో కోట్లు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈమె బడా ఫంక్షన్స్ లో స్టేజ్ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా కోటి డిమాండ్ చేస్తోంది. స్టేజ్ షో లకు బాలీవుడ్ స్టార్స్ కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

వారితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోటి ఛార్జి చేయడం మామూలు విషయం కానీ కాదు. క్రేజ్ ఆ స్థాయిలో ఉందని ఉత్తరాది ఈవెంట్ మేనెజర్స్ అంటున్నారు. ఓపెనింగ్స్ ఇంకా స్టేజ్ షో లతో రకుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీగా గడిపేస్తుంది. హీరోయిన్ గా ఆఫర్లు రావడం ఇక అసాధ్యంగా భావించిన ముద్దుగుమ్మ ఈవెంట్ స్టేజ్ షో లు చేయడంతో పాటు ఐటెం సాంగ్స్ కు కూడా ఓకే చెబుతోంది. క్రేజ్ ఉన్నప్పుడే కోట్లు సంపాదించుకోవాలని ఈ అమ్మడి ఆలోచన బానే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఫేడ్ అవుట్ అయినా ఇలా సక్సెస్ అవుతోందన్నమాట రకుల్.