జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ
Balakrishna interesting comments on junior ntr full time political entry
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి పాలు అయిన తెలుగు దేశం పార్టీ, అండ కోసం ఎదురు చూస్తుంది అని తమ తమ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే టిడిపి నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లో కి అడుగు పెడితే టిడిపి కి పూర్వ వైభవం వస్తుంది అని చాలామంది తెలిపారు.
అయితే ఇదే విషయం పై నందమూరి బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
నందమూరి తారక రామారావు కి ఇంకా సినిమా భవిష్యత్ చాలా ఉంది అని బాలకృష్ణ అన్నారు.
అయితే ఇలాంటి సమయంలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలా, వోద్దా అనేది వాడి ఇష్టం అని వ్యాఖ్యానించారు.
సినిమాలు వదిలేసి రమ్మని అనలేం కదా అని అన్నారు. అంతేకాక నేను సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను, నాన్నగారు కూడా ముఖ్యమంత్రి గా ఉంటూనే సినిమా లు చేశారు.
కానీ, పూర్తి స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, సినిమాలు వదిలేసి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం అని బాలకృష్ణ అన్నారు.
అయితే ప్రస్తుతం టిడిపి చాలా గట్టి పరిస్తితులను ఎదుర్కొంటుంది.
వైసీపీ ఒక పక్క సంక్షేమ పథకాల అమలు తో రాష్ట్రం లో ప్రజల మన్నన పొందుతున్న సమయంలో టిడిపి మళ్లీ రావడం అనేది కష్టమని చెప్పాలి.
అంతేకాక ఇటీవల బాలకృష్ణ సైతం టిడిపి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ పార్టీ అయినా అధికారం లోని వచ్చే అవకాశం ఉంది, ఒక్క టిడిపి తప్ప అంటూ వ్యాఖ్యానించారు.
బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ చర్చ గా మారింది.