Movies

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

తెలుగులో 2003వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహించినటువంటి వసంతం అనే చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరోయిన్ కళ్యాణి గురించి తెలియనివారుండరు.

అయితే ఈమె అసలు పేరు కావేరి అయినప్పటికీ సినిమా పరిశ్రమ కోసం కళ్యాణి గా పేరు మార్చుకుంది.

కాగా తెలుగులో కల్యాణి నటించినటువంటి వసంతం, శేషు, దొంగొడు, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మున్నా, పందెం తదితర చిత్రాలు కళ్యాణికి మంచి గుర్తింపు తెచ్చాయి.

అయితే తెలుగులో ఒకప్పుడు కళ్యాణి వరుస సినిమాల ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో లో మలయాళం చిత్రపని సినీ పరిశ్రమకు చెందినటువంటి దర్శకుడు సూర్య కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు వీళ్లిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఇద్దరు మధ్య మనస్పర్ధలు గొడవలు రావడంతో తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

అయితే ఆ తర్వాత కళ్యాణి కొంతకాలం పాటు గ్యాప్ తీసుకొని మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.

అయితే ప్రస్తుతం కళ్యాణి తానే స్వయంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.

అయితే ఒకప్పుడు హీరోయిన్ గా జగపతి బాబు, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ్ రవితేజ, యాంగ్రీ స్టార్ రాజశేఖర్, తదితర స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.

ఏదేమైనప్పటికీ పెళ్లి తర్వాత మాత్రం కళ్యాణి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.